Vijay Thalapathy Remuneration : ఆ సినిమాకు రూ.200 కోట్లు తీసుకుంటున్న విజయ్ దళపతి
Vijay Thalapathy Remuneration : విజయ్ దళపతికి సౌతిండియాలో మంచి క్రేజ్ ఉంది. ఇటీవల వచ్చిన వరిసు సినిమా మంచి కలెక్షన్స్ సాధించింది. అయితే లోకేశ్ కనగరాజ్ తో రాబోయో సినిమాకు విజయ్ భారీ మెుత్తంలో తీసుకుంటున్నాడట.
మొన్నటి వరకు అత్యధిక పారితోషికం తీసుకునే నటుల ప్రశ్న తలెత్తినప్పుడల్లా సల్మాన్, ప్రభాస్ పేర్లు బయటకు వచ్చేవి. సల్మాన్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌లతో భారీ పారితోషికం అందుకునేవాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ కూడా భారీ మెుత్తంలోనే తీసుకుంటున్నాడు. సాధారణంగా ఈ ఇద్దరి పేర్లు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునేవారిగా వార్తలు వస్తాయి. అయితే దళపతి విజయ్ తన కొత్త చిత్రం LEOతో అగ్రస్థానంలో ఉంటున్నాడు.
దశాబ్ద కాలంగా తన ఇమేజ్‌ని పెంచుకుంటూ వస్తున్నాడు విజయ్(Vijay). వరిసు వంటి యావరేజ్ సినిమాలు కూడా కొనుగోలుదారులకు డబ్బు సంపాదించి పెట్టాయి. దీంతో సౌత్‌లో మోస్ట్ వాంటెండ్ స్టార్‌గా నిలిచాడు దళపతి. తమిళంతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో కూడా విజయ్‌కి చెప్పుకోదగ్గ మార్కెట్ ఉంది. ఇది కూడా అతనికి భారీ రెమ్యూనరేషన్(Remuneration) ఇవ్వడానికి మరో కారణం.
తన చివరి చిత్రం వరిసు(Varisu)కు విజయ్ భారీ మెుత్తంలో అందుకున్నట్లు వార్తలు వచ్చాయి. వచ్చే సినిమాకు రూ.200 కోట్ల వరకు తీసుకుంటున్నాడని తెలుస్తోంది. తమిళ చిత్ర పరిశ్రమ నివేదికల ప్రకారం లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో విజయ్ తన రాబోయే గ్యాంగ్‌స్టర్ చిత్రం LEO కోసం అందుకుంటున్న పారితోషికం ఇది. లియో ఈ ఏడాది అక్టోబర్ 19న విడుదల కానుంది.
దళపతి 67వ సినిమాలో పెద్ద స్టార్ కాస్ట్ ఉంది. ఈ చిత్రంలో సంజయ్ దత్(sanjay dutt), గౌతమ్ మీనన్, నివిన్ పౌలీ నటిస్తున్నారు. అర్జున్ సర్జా కూడా ఉన్నాడు. ఈ సినిమా కోసం అర్జున్ 4.5 నుంచి 5 కోట్ల పారితోషికం(Remuneration) తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సంజయ్ దత్ రూ.10 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. దళపతి విజయ్ 200 కోట్ల వరకు డిమాండ్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.
మరోవైపు విజయ్, లోకేష్ కనగరాజ్ సినిమా కావడంతో క్రేజ్ ఏర్పడింది. దీంతో ఈ సినిమా డిజిటల్ హక్కులకు(digital rights) ఎక్కడ లేని డిమాండ్ వచ్చి పడింది. సౌతిండియాలోనే అత్యధిక మొత్తానికి ఈ సినిమా డిజిటల్ హక్కులు అమ్ముడయ్యాయని అంటున్నారు. ప్రముఖ ఓటీటీ(OTT) నెట్‌ఫ్లిక్స్ విజయ్, లోకేష్ సినిమా డిజిటల్ హక్కులను ఏకంగా రూ.160 కోట్లకు దక్కించుకోవడం విశేషం. అన్ని భాషల డిజిటల్ హక్కులు ఈ డీల్ కింద నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందట.