Romantic Thriller OTT: రెమ్యున‌రేష‌న్ లేకుండా విజ‌య్ సేతుప‌తి ఫ్రీగా చేసిన మూవీ ఏడాది త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది!-vijay sethupathi kollywood movie azhagiya kanne streaming now amazon prime video romantic thriller ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Romantic Thriller Ott: రెమ్యున‌రేష‌న్ లేకుండా విజ‌య్ సేతుప‌తి ఫ్రీగా చేసిన మూవీ ఏడాది త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది!

Romantic Thriller OTT: రెమ్యున‌రేష‌న్ లేకుండా విజ‌య్ సేతుప‌తి ఫ్రీగా చేసిన మూవీ ఏడాది త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది!

Romantic Thriller OTT: విజ‌య్ సేతుప‌తి రెమ్యున‌రేష‌న్ తీసుకోకుండా ఫ్రీగా న‌టించిన త‌మిళ మూవీ అళ‌గీయ క‌న్నే ఓటీటీలోకి వ‌చ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

విజ‌య్ సేతుప‌తి అళ‌గీయ క‌న్నే మూవీ ఓటీటీ

Romantic Thriller OTT: మ‌హారాజ మూవీతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ను అందుకున్నాడు విజ‌య్ సేతుప‌తి. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ మూవీ త‌మిళంతో పాటు తెలుగులోనూ నిర్మాత‌ల‌కు కాసుల వ‌ర్షాన్ని కురిపిస్తోంది.

వంద కోట్ల క్ల‌బ్‌కు చేరువైంది. పెట్టిన పెట్టుబ‌డికి పదింత‌ల లాభాల‌ను తెచ్చిపెట్ట‌డ‌మే కాకుండా ఈ ఏడాది కోలీవుడ్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా మ‌హారాజ నిలిచింది. మ‌హారాజ మూవీలో మ‌మ‌తామోహ‌న్‌దాస్‌, అనురాగ్ క‌శ్య‌ప్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

అమెజాన్ ప్రైమ్‌లో...

కాగా విజ‌య్ సేతుప‌తి గెస్ట్ పాత్ర‌లో న‌టించిన త‌మిళ మూవీ అళ‌గీయ క‌న్నే ఓటీటీలోకి వ‌చ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. అళ‌గీయ క‌న్నే మూవీలో లియో శివ‌కుమార్‌, సంచితా శెట్టి హీరోహీరోయిన్లుగా న‌టించారు. ఆర్ విజ‌య్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో విజ‌య్ సేతుప‌తి గెస్ట్‌గా ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించారు.

రెమ్యున‌రేష‌న్ లేకుండా...

అళ‌గీయ క‌న్నే మూవీలో న‌టించ‌డానికి విజ‌య్ సేతుప‌తి ఒక్క రూపాయి కూడా రెమ్యున‌రేష‌న్ తీసుకోలేద‌ట‌. ద‌ర్శ‌కుడిపై ఉన్న అభిమానంతో ఫ్రీగా ఈ సినిమాలో న‌టించారు. విజ‌య్ సేతుప‌తి క్యారెక్ట‌ర్‌ను హైలైట్ చేస్తూ మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ చేయ‌డంతో ఈ చిన్న సినిమాపై కోలీవుడ్ ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి ఏర్ప‌డింది. కానీ రొటీన్ స్టోరీలైన్ కార‌ణంగా అళ‌గీయ క‌న్నే క‌మ‌ర్షియ‌ల్ ఫెయిల్యూర్‌గా నిలిచింది.

ఏడాది త‌ర్వాత ఓటీటీలోకి...

దాదాపు ఏడాది త‌ర్వాత ఈ మూవీ అళ‌గీయ క‌న్నే మూవీ ఓటీటీలోకి వ‌చ్చింది. మ‌హారాజ హిట్ ఈ మూవీకి క‌లిసివ‌చ్చింది. విజ‌య్ సేతుప‌తి రోల్ కార‌ణంగా అమెజాన్ ప్రైమ్‌లో అళ‌గీయ క‌న్నే ట్రెండింగ్ మూవీస్ లిస్ట్‌లో ఉంది.

సినిమా డైరెక్ట‌ర్ క‌థ‌...

ఇన్బా (లియో శివ‌కుమార్‌) సినిమా డైరెక్ట‌ర్ కావాల‌నే ప్ర‌య‌త్నాల్లో ఉంటాడు. అవ‌కాశాల కోసం ఎదురుచూస్తూ ఖాళీ టైమ్‌లో నాట‌కాల‌కు స్క్రిప్ట్‌లు రాస్తుంటాడు. ఆ నాట‌కాల ద్వారా క‌స్తూరితో (సంచితాశెట్టి)తో ఇన్బాకు ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. ఇద్ద‌రు ప్రేమ‌లో ప‌డ‌తారు.

కానీ కులాలు వేరు కావ‌డంతో వారి పెళ్లికి పెద్ద‌లు ఒప్పుకోరు. దాంతో చెన్నై పారిపోయి ఇన్భా, క‌స్తూరి పెళ్లిచేసుకుంటారు. హ్యాపీగా సాగిపోతున్న వారి కాపురంలో అనుకోకుండా క‌ల‌త‌లు వ‌స్తాయి. అవేమిటి? హీరో విజ‌య్ సేతుప‌తితో సినిమా చేసే అవ‌కాశం ఇన్బాకు ఎలా వ‌చ్చింది అన్న‌దే అళ‌గీయ క‌న్నే మూవీ క‌థ‌.

పాన్ ఇండియ‌న్ ఇమేజ్‌...

ప్ర‌స్తుతం హీరోగానే కాకుండా డిఫ‌రెంట్ రోల్స్‌లో పాన్ ఇండియ‌న్ యాక్ట‌ర్‌గా పేరుతెచ్చుకున్నాడు విజ‌య్ సేతుప‌తి. బాలీవుడ్‌లో షారుఖ్‌ఖాన్ జ‌వాన్‌లో విల‌న్‌గా క‌నిపించాడు. నెగెటివ్ షేడ్ రోల్‌లో అస‌మాన న‌ట‌న‌తో హిందీ ఆడియెన్స్‌ను మెప్పించాడు.

జ‌వాన్‌తో పాటు హిందీలో క‌త్రినాకైఫ్ జోడీగా మెర్రీ క్రిస్మ‌స్ అనే సినిమా చేశాడు. తెలుగులోనూ ఉప్పెన‌, సైరాలో న‌టించాడు. ప్ర‌స్తుతం త‌మిళంలో ఐదారు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు విజ‌య్ సేతుప‌తి. విండ్ పేరుతో ఓ వెబ్‌సిరీస్ చేస్తున్నాడు. థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ వెబ్‌సిరీస్ త్వ‌ర‌లో డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది.