Vijay Sethupathi Web Series: విజయ్ సేతుపతి హారర్ వెబ్ సిరీస్ టైటిల్ ఇదే - స్ట్రీమింగ్ ఎందులో...ఎప్పుడంటే?
Vijay Sethupathi Web Series: తమిళంలో విజయ్ సేతుపతి ఓ హారర్ వెబ్‌సిరీస్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ముథు ఎన్‌కిరా కట్టాన్ పేరుతో రూపొందుతోన్న ఈ వెబ్‌సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి.
Vijay Sethupathi Web Series: ఇటీవలే మహారాజతో (Maharaja) కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు విజయ్ సేతుపతి. రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అదరిపోయే వసూళ్లను రాబట్టింది. కేవలం 20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిదిన మహారాజా 110 కోట్లకుపైగా కలెక్షన్స్ దక్కించుకున్నది. ఈ ఏడాది కోలీవుడ్‌లో నిర్మాతలకు అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిన మూవీగా నిలిచింది.
హారర్ వెబ్‌సిరీస్...
మహారాజ సక్సెస్ తో జోరు మీదున్న విజయ్ సేతుపతి తాజాగా తమిళంలో ఓ హారర్ వెబ్‌సిరీస్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ హారర్ వెబ్‌సిరీస్‌కు ముథు ఎన్‌కిరా కట్టాన్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోన్నట్లు తెలిసింది. ఈ హారర్ వెబ్‌సిరీస్‌లో గుడ్‌నైట్ ఫేమ్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ మణికందన్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వెబ్‌సిరీస్‌లో విజయ్ సేతుపతి క్యారెక్టరైజేషన్, లుక్ కొత్తగా ఉంటాయని అంటున్నారు.
ఫర్జీ వెబ్‌సిరీస్‌లో...
సినిమాలతో బిజీగా ఉంటూనే ఆడపాదడపా వెబ్‌సిరీస్‌లు చేస్తోన్నాడు విజయ్ సేతుపతి. గతంలో తమిళ వెబ్‌సిరీస్ నవరసలో రాహుల్ నంబిరాయర్ ఎపిసోడ్‌లో విజయ్ సేతుపతి నటించాడు. అలాగే ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ రాజ్ డీకే దర్శకత్వం వహించిన హిందీ వెబ్‌సిరీస్ ఫర్జీలో టాస్క్‌ఫోర్స్ ఆఫీసర్‌గా కీలక పాత్రలో విజయ్ సేతుపతి కనిపించాడు.
ప్రశంసలు వచ్చినా...
మహారాజకు ముందు విజయ్ సేతుపతి నటించిన సినిమాలు చాలా సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. మామనితన్, డీఎస్‌పీతో పాటు పలు సినిమాల్లోని కథలు, విజయ్ సేతుపతి యాక్టింగ్‌పై విమర్శలొచ్చాయి. బాలీవుడ్‌లో కత్రినాకైఫ్‌తో విజయ్ సేతుపతి చేసిన మెర్రీ క్రిస్మస్ ప్రశంసలు అందుకున్న కమర్షియల్‌గా మాత్రం సక్సెస్‌గా నిలవలేకపోయింది.
సాధారణ బార్బర్‌గా...
మహారాజతో లాంగ్ గ్యాప్ తర్వాత కమర్షియల్ హిట్ అందుకున్నాడు విజయ్ సేతుపతి. తన కూతురికి జరిగిన అన్యాయంపై రివేంజ్ తీర్చుకునే సాధారణ బార్బర్ పాత్రలో విజయ్ సేతుపతి అసమాన నటనతో అభిమానులను మెప్పించాడు. మహారాజా మూవీలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్ కీలక పాత్రల్లో నటించారు. తెలుగులోనే సేమ్ టైటిల్‌తో రిలీజైన మహారాజ మూవీ నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది.
విడుదలై పార్ట్ 2
జూలై 12న నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) రిలీజైన మహారాజ మూవీ నెల రోజులుగా ట్రెండింగ్‌లో ఉంది. నేషనల్ వైడ్‌గా టాప్, ఇంటర్నేషనల్ లెవల్‌లో టాప్ ఫోర్‌లో మహారాజ కొనసాగుతోన్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. మహారాజ తర్వాత విడుదలై పార్ట్ 2 తో పాటు గాంధీ టాక్స్ పేరుతో ఓ మూవీ సినిమా చేస్తోన్నాడు విజయ్ సేతుపతి.
గాంధీ టాక్స్ మూవీ డైలాగ్స్ లేకుండా మూకీ మూవీగా ప్రయోగాత్మకంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అదితీరావ్ హైదరీ, అరవింద్ స్వామి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
బాలీవుడ్‌లో షారుఖ్‌ఖాన్ జవాన్‌లో విజయ్ సేతుపతి విలన్‌గా నటించాడు. షారుఖ్ కు ధీటుగా నటించి హిందీ ఆడియెన్స్‌ను మెప్పించాడు. థియేటర్లలో ఈ మూవీ 1100 కోట్ల వసూళ్లను సాధించింది.