OTT Crime Thriller: ఓటీటీలోకి సడెన్‍గా వచ్చిన విజయ్ సేతుపతి క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ..-vijay sethupathi crime thriller viduthalai part 2 movie now streaming on amazon prime video ott in tamil and telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Crime Thriller: ఓటీటీలోకి సడెన్‍గా వచ్చిన విజయ్ సేతుపతి క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ..

OTT Crime Thriller: ఓటీటీలోకి సడెన్‍గా వచ్చిన విజయ్ సేతుపతి క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ..

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 19, 2025 01:47 PM IST

Viduthalai Part 2 OTT Streaming: విడుదలై 2 సినిమా సడెన్‍గా ఓటీటీలోకి వచ్చేసింది. విజయ్ సేతుపతి లీడ్ రోల్ చేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం స్ట్రీమింగ్ మొదలైంది. ఈ చిత్రం ఏ ప్లాట్‍ఫామ్‍లో వచ్చిందంటే..

Viduthalai 2 OTT Streaming: ఓటీటీలోకి సడెన్‍గా వచ్చిన విజయ్ సేతుపతి క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ..
Viduthalai 2 OTT Streaming: ఓటీటీలోకి సడెన్‍గా వచ్చిన విజయ్ సేతుపతి క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ..

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి లీడ్ రోల్‍లో నటించిన విడుదలై పార్ట్ 2 చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ హిట్ అయిన విడుదలైకు సీక్వెల్‍గా ఈ మూవీ అడుగుపెట్టింది. వెట్రిమారన్ దర్శకత్వం వహించిన విడుదలై 2 చిత్రం గత నెల డిసెంబర్ 20న థియేటర్లలో విడుదలైంది. తెలుగులో విడుదల 2 పేరుతో వచ్చింది. అయితే, అంచనాలకు తగ్గట్టుగా ఈ మూవీ కమర్షియల్‍గా సక్సెస్ కాలేకపోయింది. ఇప్పుడు విడుదలై 2 చిత్రం సడెన్‍గా ఓటీటీలోకి నేడు అడుగుపెట్టింది.

yearly horoscope entry point

స్ట్రీమింగ్ ఎక్కడంటే..

విడుదలై పార్ట్ 2 చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నేడు (జనవరి 19) సడెన్‍గా స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ముందస్తుగా ఎలాంటి ప్రచారం లేకుండా హఠాత్తుగా అందుబాటులోకి వచ్చేసింది. తెలుగు వెర్షన్ విడుదల పార్ట్ 2 కూడా స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. విడుదలై పార్ట్ 1 కూడా ప్రైమ్ వీడియోలో తాజాగా అందుబాటులోకి వచ్చింది. జీ5 ఓటీటీనూ పార్ట్ 1 ఉంది.

విడుదలై 2 సినిమా స్ట్రీమింగ్ హక్కులను జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్ దక్కించుకున్నట్టు ముందుగా సమాచారం వెల్లడైంది. థియేట్రికల్ రన్ తర్వాత ఆ ఓటీటీలోనే రానుందని లీక్స్ బయటికి వచ్చాయి. విడుదలై పార్ట్ 1 కూడా అప్పట్లో అదే ఓటీటీలోకి వచ్చింది. అయితే, ఇప్పుడు విడుదలై 2 మాత్రం సడెన్‍గా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. మరి విడుదలై 2 జీ5 ఓటీటీలోనూ వస్తుందా.. ప్రైమ్ వీడియోలో ఒక్కటే స్ట్రీమింగ్‍కు ఉంటుందా అనేది చూడాలి.

ప్రశంసలు వచ్చినా.. కమర్షియల్‍గా నిరాశ

వెట్రిమారన్ తెరకెక్కించిన విడుదలై పార్ట్ 2 చిత్రానికి ప్రశంసలు బాగానే దక్కాయి. థియేటర్లలో రిలీజైన మొదట్లో ఈ చిత్రానికి పాజిటివ్ టాకే వచ్చింది. విజయ్ సేతుపతి నటన అద్భుతమంటూ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, కమర్షియల్‍గా ఈ చిత్రం పెద్దగా సక్సస్ కాలేకపోయింది. ఈ మూవీకి ఓవరాల్‍గా రూ.60కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు అంచనా. భారీ క్రేజ్ మధ్య వచ్చిన ఈ సినిమా మోస్తరు వసూళ్లతోనే సరిపెట్టుకుంది.

విడుదలై 2 చిత్రంలో విజయ్ సేతుపతితో పాటు సూరిది కూడా ప్రధాన పాత్రే. మంజూ వారియర్, గౌతమ్ మీనన్, భవానీ శ్రీ, రాజీవ్ మీనన్, హరీశ్ ఉత్తమన్ కిశోర్, బోస్ వెంకట్ ఈ చిత్రం కీలకపాత్రల్లో నటించారు. ఈ మూవీని ఆర్ఎస్ ఇన్ఫోటైన్‍మెంట్, గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ బ్యానర్లపై ఎల్రెడ్ కుమార్, వెట్రిమారన్ నిర్మించారు. ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు.

Whats_app_banner

సంబంధిత కథనం