Horror OTT: విజయ్ సేతుపతి పిజ్జా మూవీని ఓటీటీలో ఈ వీకెండ్ ఫ్రీగా చూడొచ్చు. ఈ సినిమాఉచితంగాస్ట్రీమింగ్ అవుతున్నట్లు సన్ నెక్స్ట్ ఓటీటీ ప్రకటించింది. పిజ్జా మూవీతో పాటు ప్రకాష్ రాజ్ ధోనీ సినిమాను సబ్‌స్క్రిప్షన్ లేకుండానే తమ ఓటీటీలో ఫ్రీగా చూడొచ్చని వెల్లడించింది. మార్చి 21 నుంచి 23 వరకు ఈ ఫ్రీ ఆఫర్ ఉంటుందని సన్ నెక్స్ట్ అనౌన్స్ చేసింది.
పిజ్జా మూవీకి కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించాడు. 2012లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ తమిళంలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఈ మూవీతోనే హీరోగా కోలీవుడ్‌లో విజయ్ సేతుపతి పాపులర్ అయ్యాడు. టాప్ హీరోగా మారిపోయాడు. కేవలం కోటిన్నర బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ ఎనిమిది కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.
తమిళంలోనే కాకుండా తెలుగు, మలయాళం డబ్ అయిన ఈ మూవీ కమర్షియల్ సక్సెస్‌గా నిలిచింది. పిజ్జా మూవీలో రమ్య నంబీసన్, బాబీ సింహా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు.
పిజ్జా మూవీ కథ చాలా వరకు ఒకే ఇంట్లో సాగుతుంది. మైఖేల్ (విజయ్ సేతుపతి) ఓ పిజ్జా డెలివరీ బాయ్. అను (రమ్య నంబీసన్) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమెతో లివింగ్ రిలేషన్‌లో ఉంటాడు. పిజ్జా డెలివరీ చేసేందుకు ఓ ఇంటికి వచ్చిన మైఖేల్ అందులోనే చిక్కుకుపోతాడు. ఆ ఇంట్లో అతడికి భయానక పరిస్థితులు ఎదురవుతాయి. కొన్ని ఆత్మలు కనిపిస్తాయి.
మరోవైపు అను కూడా కనిపించకుండాపోతుంది. ఆ ఇంట్లో ఆత్మలు ఉన్నది నిజమేనా? ఆ ఇంటి నుంచి మైఖేల్ ఏ విధంగా బయటపడ్డాడు అన్నదే పిజ్జా మూవీ కథ. పిజ్జా మూవీ స్టోరీతో పాటు సుబ్బరాజు టేకింగ్, ట్విస్ట్‌లు ఆడియెన్స్‌ను మెప్పించాయి.
పిజ్జాతో పాటు ప్రకాష్ రాజ్ ధోనీ మూవీ కూడా మూడు రోజుల పాటు సన్ నెక్స్ట్ ఓటీటీలో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. స్పోర్ట్స్ డ్రామా మూవీగా రూపొందిన ధోనీకి ప్రకాష్ రాజ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ కావడం గమనార్హం. ఈ సినిమాలో పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి, రాధిక ఆప్టే కీలక పాత్రల్లో నటించారు.
తండ్రీ కొడుకుల అనుబంధంతో ఈ మూవీ రూపొందింది. తన కొడుకును గొప్పగా చదివించాలని ఓ తండ్రి కలలు కంటాడు. కొడుకు మాత్రం క్రికెటర్ కావాలని కోరుకుంటాడు. ఈ క్రమంలో వారిద్దరి నెలకొన్న సంఘర్షణ నేపథ్యంలో ధోనీ మూవీ రూపొందింది.
ధోనీ సినిమాకు ఇళయరాజా మ్యూజిక్ అందించాడు. మంచి సినిమాగా ప్రేక్షకుల మన్ననలను అందుకున్న ధోనీ కమర్షియల్‌గా మాత్రం మోస్తారు వసూళ్లను మాత్రమే రాబట్టింది.
సంబంధిత కథనం