Viduthalai 2 OTT: విజయ్ సేతుపతి, వెట్రిమారన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి అప్పుడే!-vijay sethapathi vetrimaran political crime thriller movie to stream on zee5 ott platform ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Viduthalai 2 Ott: విజయ్ సేతుపతి, వెట్రిమారన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి అప్పుడే!

Viduthalai 2 OTT: విజయ్ సేతుపతి, వెట్రిమారన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి అప్పుడే!

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 29, 2024 04:48 PM IST

Viduthalai 2 OTT: విడుదలై 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద అంచనాలకు తగ్గట్టు పర్ఫార్మ్ చేయలేకపోతోంది. టాక్ బాగానే ఉన్నా వసూళ్లు జోరుగా రావడం లేదు. కాగా ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో అంచనాలు వెలువడ్డాయి. ఆ వివరాలు ఇవే..

Viduthalai 2 OTT: విజయ్ సేతుపతి, వెట్రిమారన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి అప్పుడే!
Viduthalai 2 OTT: విజయ్ సేతుపతి, వెట్రిమారన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి అప్పుడే!

తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన విడుదలై 2 చిత్రం హైప్ మధ్య వచ్చింది. గతేడాది వచ్చి ప్రశంసలు పొందిన విడుదలైకు సీక్వెల్‍గా ఈ చిత్రం రూపొందింది. విడుదలై 2 చిత్రం డిసెంబర్ 20వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో విడుదల 2 పేరుతో వచ్చింది. ఈ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి పాజిటివ్ టాకే వచ్చినా.. ఆ స్థాయిలో కలెక్షన్లు దక్కడం లేదు.

yearly horoscope entry point

విడుదలై 2 మూవీకి ఆరంభంలో వసూళ్లు బాగానే వచ్చినా.. ఆ తర్వాత డ్రాప్ అయ్యాయి. అంచనాలకు తగ్గ రేంజ్‍లో కలెక్షన్లు రావడం లేదు. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍పై తాజాగా బజ్ నెలకొంది.

స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

విడుదలై 2 చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుంది. ఈ చిత్రాన్ని 2025 జనవరి 17వ తేదీన స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చేందుకు జీ5 ఓటీటీ ప్లాన్ చేసినట్టు సమాచారం బయటికి వచ్చింది. తమిళంతో పాటు విడుదల 2 తెలుగు వెర్షన్ కూడా అడుగుపెట్టనుందని సమాచారం. ఈ విషయంలో జీ5 ఓటీటీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

విడుదలై 2 మూవీలో పెరుమాల్ వాతియార్ పాత్రలో విజయ్ సేతుపతి నటన ప్రశంసలను దక్కించుకుంటోంది. ఆయన చేసిన ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఈ మూవీకి సేతుపతి యాక్టింగ్ హైలైట్‍గా నిలిచింది. ఈ చిత్రంలో కానిస్టేబుల్ కుమరేశన్ పాత్రలో సూరి కూడా మెప్పించారు. తొలి భాగానికి కొనసాగింపుగానే విడుదలై 2 రూపొందింది. ఈ చిత్రంలో మంజు వారియర్, భవానీ శ్రీ, కిశోర్, గౌతమ్ మీనన్, రాజీవ్ మీనన్ కీరోల్స్ చేశారు.

9 రోజుల కలెక్షన్లు ఇలా..

విడుదలై 2 సినిమా ఇప్పటి వరకు 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.50.36 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీకి ఇలా మోస్తరు వసూళ్లే దక్కాయి. ఇంకా థియేట్రికల్ రన్ సాగుతోంది. అయితే, అంత జోరుగా వసూళ్లు రావడం లేదు. ఈ చిత్రం ఫుల్ రన్‍లో రూ.60కోట్ల మార్క్ తాకుతుందేమో చూడాలి.

విడుదలై 2 సినిమాను వెట్రిమారన్ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించారు. తాను అనుకున్న సిద్ధాంతం ప్రకారం ఈ మూవీ కథను చూపించారు. ఈ చిత్రానికి ఎక్కువగా పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే కొన్ని సీన్లు సాగదీతగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మొత్తంగా ఈ మూవీ మిశ్రమ స్పందన అందుకుంది. ఇది బాక్సాఫీస్ లెక్కలపై ఎఫెక్ట్ చూపింది.

Whats_app_banner