KGF Sequel Update: కేజీఎఫ్‌ సీక్వెల్స్‌లో చాలా మంది హీరోలు.. జేమ్స్ బాండ్ తరహాలో చిత్రాలు..!-vijay kirgandur says kgf sequels to have different heroes like james bond movies
Telugu News  /  Entertainment  /  Vijay Kirgandur Says Kgf Sequels To Have Different Heroes Like James Bond Movies
కేజీఎఫ్
కేజీఎఫ్ (HT_PRINT)

KGF Sequel Update: కేజీఎఫ్‌ సీక్వెల్స్‌లో చాలా మంది హీరోలు.. జేమ్స్ బాండ్ తరహాలో చిత్రాలు..!

10 January 2023, 12:04 ISTMaragani Govardhan
10 January 2023, 12:04 IST

KGF Sequel Update: కేజీఎఫ్ సీక్వెల్స్‌తు సంబంధించి.. ఆ ఫ్రాంఛైజీ మేకర్, హోంబళే ఫిల్మ్స్ అధినేత విజయ్ కిరగందూర్ ఆసక్తిర విషయాలను తెలియజేశారు. ఈ సీక్వెల్స్‌లో జేమ్స్ బాండ్ తరహాలో చాలా మంది హీరోలు ఉంటారని స్పష్టం చేశారు.

KGF Sequel Update: ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీఎఫ్ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యశ్ హీరోగా రూపొందిన ఈ సినిమా అద్భుత వసూళ్లతో అదరగొట్టింది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్స్‌పై కూడా ఆసక్తి మొదలైంది. అయితే గత కొంతకాలంగా కేజీఎఫ్ సినిమా గురించి విపరీతంగా ఊహాగానాలు వస్తున్నాయి. కేజీఎఫ్3 రాబోతుందని, ఇందులో హీరోగా యశ్ కాకుండా.. అతడి స్థానంలో మరొకరు నటిస్తారని వార్తలు వ్యాపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై కేజీఎఫ్ నిర్మాత స్పందించారు.

కేజీఎఫ్‌ను నిర్మంచిన హోంబళే ఫిల్మ్స్ అధినేత విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ.. కేజీఎఫ్ ఛాప్టర్ 3కి ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. కేజీఎఫ్-3 2025లో మొదలవుతుందని, 2026 తర్వాత విడుదలవుతుందని స్పష్టం చేశారు. ఇంత వరకు ఈ సీక్వెల్‌కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ప్రారంభం కాలేదని స్పష్టం చేశారు.

అంతేకాకుండా కేజీఎఫ్ ఛాప్టర్ 3లో హీరో ఎవరనేది కూడా విజయ్ హింట్ ఇచ్చారు. అధికారికంగా ఇందులో హీరో గురించి చెప్పనప్పటికీ రాకీ భాయ్‌గా మాత్రం కొత్త హీరో కనిపించబోతున్నట్లు స్పష్టం చేశారు. కేజీఎఫ్ సీక్వెల్స్‌లో జేమ్స్ బాండ్ తరహాలో విభిన్న హీరోలు ఉంటారని తెలిపారు. మొత్తం కేజీఎఫ్‌కు ఐదు సీక్వెల్స్‌ వస్తాయని, కేజీఎఫ్ సిరీస్‌లో వీరు ఛేంజ్ అవుతుంటారని స్పష్టం చేశారు.

కేజీఎఫ్-3 సినిమా ఎప్పుడు మొదలవుతుందో కూడా విజయ్ కిరగందూర్ అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో సలార్ సినిమా చేస్తున్నారని, ఇది పూర్తయిన తర్వాత జూనియర్ ఎన్‌టీఆర్‌తో సినిమా చేస్తున్నారని, ఆ తర్వాత కేజీఎఫ్ ఛాప్టర్3 ప్రారంభమవుతుందని తెలిపారు. ఇప్పటికే కేజీఎఫ్ 2, సలార్ చిత్రానికి మధ్య ఏదో సంబంధం ఉందని ఇప్పటికే కొన్ని లీకులు వచ్చాయి. అంతేకాకుండా సలార్ సెట్‌లో ప్రభాస్‌తో పాటు యశ్ కూడా కనిపించడంతో ఈ వార్తలకు బలం చేకూరింది.

సంబంధిత కథనం