Salaar movie new update: సలార్ నుంచి క్రేజీ అప్డేట్.. త్వరలో షూటింగ్ పూర్తి-vijay kiragandur says salaar movie completes 85 percent of the shooting ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Vijay Kiragandur Says Salaar Movie Completes 85 Percent Of The Shooting

Salaar movie new update: సలార్ నుంచి క్రేజీ అప్డేట్.. త్వరలో షూటింగ్ పూర్తి

Maragani Govardhan HT Telugu
Dec 24, 2022 06:11 AM IST

Salaar movie new update: ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సలార్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ప్రస్తుతానికి 85 శాతం చిత్రీకరణ పూర్తయిందని సదరు చిత్ర నిర్మాత విజయ్ కిరగందుర్ స్పష్టం చేశారు. జనవరి కల్లా షూటింగ్ పూర్తవుతుందని అన్నారు.

సలార్
సలార్

Salaar movie new update: పాన్ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది కనీసం రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆదిపురుష్‌తో పాటు సలార్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. సలార్ చిత్రాన్ని కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండగా.. ఆ సినిమాను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ నిర్మాణ బాధ్యతలు వహిస్తోంది. తాజాగా హోంబలే ఫిల్మ్స్ అధినేత విజయ్ కిరంగందుర్ సలార్ గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా ఇప్పటికే 85 శాతం షూటింగ్ అయిపోయిందని స్పష్టం చేశారు.

"సలార్ చిత్రం బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ అధిగమిస్తుంది. ఎందుకంటే ఈ కథకు ఆ సత్తా ఉంది. 85 శాతం వరకు షూటింగ్ అయిపోయింది. జనవరి ముగిసే లోపు మిగిలిన షూటింగ్ పూర్తవుతుంది. వీఎఫ్ఎక్స్ కోసం కనీసం 6 నెలల సమయం పడుతుంది. కాబట్టి సెప్టెంబరు 28న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం." అని విజయ్ కిరగందుర్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రషెస్ చూశాని, ఫుల్ యాక్షన్ సీన్లతో ఆకట్టుకుంటుందని విజయ్ తెలిపారు. ప్రభాస్, పృథ్వీరాజ్ పర్ఫార్మెన్స్ అదిరిపోయిందని అన్నారు.

రాబోయే రోజుల్లో అన్ని సౌత్ భాషల్లోనూ చిత్రాలను తీస్తామని విజయ్ తెలిపారు. "భారత ఎంటర్టైన్మెంట్ రంగంలో వచ్చే ఐదేళ్ల పాటు రూ.3 వేల కోట్లు పెట్టుబడి పెట్టాలని చూస్తున్నాం. దీని వల్ల భారత్‌లో వినోద పరిశ్రమ మరింత అభివృద్ధఇ చెందుతుందని ఆశిస్తున్నాం. ప్రతి ఏడాది ఓ ఈవెంట్ మూవీతో సహా ఐదారు సినిమాలు ఉంటాయి. ప్రస్తుతం మేము దక్షిణ భాషల్లో సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాం." అని ఆయన అన్నారు.

హోంబలే ఫిల్మ్స్‌ తెలుగులో నిర్మిస్తున్న మొదటి చిత్రం సలార్. ప్రభాస్ ఈ చిత్రం ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్‌గా చేస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబరు 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ఇండియా స్థాయిలో అలరించనుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.