Vijay Deverakonda Waiting : రష్మిక కోసం వెయిట్ చేస్తున్న విజయ్ దేవరకొండ.. సమ్​థింగ్.. సమ్​థింగ్ అంటున్న ఫ్యాన్స్!-vijay deverakonda wants to act with rashmika mandanna and his waiting for good script ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Vijay Deverakonda Wants To Act With Rashmika Mandanna And His Waiting For Good Script

Vijay Deverakonda Waiting : రష్మిక కోసం వెయిట్ చేస్తున్న విజయ్ దేవరకొండ.. సమ్​థింగ్.. సమ్​థింగ్ అంటున్న ఫ్యాన్స్!

Anand Sai HT Telugu
Aug 23, 2023 12:07 PM IST

Vijay Deverakonda-Rashmika Mandanna : విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'ఖుషి' సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్నాడు. సమంత ప్రస్తుతం అమెరికాలో ఉండటంతో ప్రమోషన్ బాధ్యత పూర్తిగా విజయ్ దేవరకొండపైనే ఉంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

విజయ్ దేవరకొండ-రష్మిక
విజయ్ దేవరకొండ-రష్మిక (twitter)

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న(Vijay Deverakonda-Rashmika Mandanna)ది హిట్ కాంబినేషన్. గీత గోవిందం సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన డియర్ కామ్రేడ్ సినిమా ఓ మోస్తరు హిట్‌గా నిలిచింది. మళ్లీ వీరిద్దరూ కలిసి నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ట్రెండింగ్ వార్తలు

విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'ఖుషి' సినిమా(Kushi Cinema) ప్రమోషన్‌లో బిజీగా ఉన్నాడు. సెప్టెంబర్ 1న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నటి సమంత(Actress Samantha) ప్రస్తుతం అమెరికాలో ఉండటంతో ప్రమోషన్ బాధ్యత పూర్తిగా విజయ్ దేవరకొండనే చూసుకుంటున్నాడు. ఈ సందర్భంగా రష్మికతో కలిసి నటించాలనే కోరికను విజయ్ దేవరకొండ బయటపెట్టాడు.

విజయ్ దేవరకొండ ఎలాంటి ప్రశ్నకైనా తడబడకుండా సమాధానం చెబుతాడు. ఖుషి సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న అతటడికి రష్మికపై ఓ ప్రశ్న ఎదురైంది. మీరిద్దరూ మళ్లీ ఎప్పుడు కలిసి నటిస్తారని ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానమిచ్చారు. 'రష్మిక మందన్నతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి వెయిట్ చేస్తున్నాను. అయితే, మంచి స్క్రిప్ట్‌ కావాలి. అలా అయితే మేమిద్దరం కలిసి నటిస్తాం.' అని విజయ్ అన్నాడు.

దీంతో విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మంచి స్క్రిప్ట్‌తో తన వద్దకు రావాలని విజయ్ చెప్పడంతో ఫ్యాన్స్ వీరి కాంబినేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు రష్మిక మందన్న, విజయ్ దేవరకొండలు డేటింగ్‌(Vijay Deverakonda Rashmika Mandanna Dating)లో ఉన్నట్లు మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై వారు ఎప్పుడూ స్పందించలేదు. తరచుగా వారు కలిసి కనిపిస్తారు. దీంతో మరోసారి రష్మికతో కలిసి నటించాలని ఉందని విజయ్ చెప్పడంతో ఫ్యాన్స్ సమ్​థింగ్.. సమ్​థింగ్ అంటున్నారు.

ఖుషి సినిమా కోసం విజయ్ దేవరకొండ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తు్న్నారు. లవ్ స్టోరీలు అందంగా తెరకెక్కించే.. శివ నిర్వాణ(Shiva Nirvana) దర్శకత్వం, మరోవైపు సమంత(Samantha) హీరోయిన్ కావడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 1వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ఖుషి పాటలు అందరినీ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ట్రైలర్ కూడా బాగుంది. పాన్ ఇండియా లెవెల్ లో వస్తున్న ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాలని చూస్తున్నాడు విజయ్ దేవరకొండ.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.