Vijay Deverakonda: మహా కుంభమేళాలో విజయ్ దేవరకొండ.. మెడలో రుద్రాక్ష మాలలు, కాషాయ పంచెకట్టులో..
Vijay Deverakonda: మహా కుంభమేళాకు వెళ్లారు హీరో విజయ్ దేవరకొండ. ప్రయాగ్‍రాజ్ వద్ద పుణ్య స్నానం చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ వరుస ప్లాఫ్‍లను ఎదుర్కొన్నారు. గతేడాది ది ఫ్యామిలీ స్టార్ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో ఓ భారీ యాక్షన్ మూవీ చేస్తున్నారు విజయ్. ఈ మూవీని ప్రాజెక్ట్ పేరు వీడీ12తో ప్రస్తుతం పిలుస్తున్నారు. మరో మూడు రోజుల్లో ఫిబ్రవరి 12న టైటిల్ టీజర్ రానుంది. ఈ తరుణంలో ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాకు విజయ్ దేవరకొండ వెళ్లారు. నదీ జలాల్లో పుణ్య స్నానం ఆచరించారు. ఆ వివరాలు ఇవే..
తల్లితో కలిసి కుంభమేళాకు..
తన తల్లి మాధవితో కలిసి ప్రయాగ్‍రాజ్‍కు మహా కుంభమేళాలో పాల్గొనేందుకు వెళ్లారు విజయ్ దేవరకొండ. అక్కడ ఎవరూ గుర్తించకుండా ముందుగా మాస్క్ ధరించారు. ఆ తర్వాత గంగ, యమున, సరస్వతి నదుల సగమం వద్ద పుణ్య స్నానం చేశారు. విజయ్, ఆయన తల్లి నదీ జలాల్లో పుణ్య స్నానం ఆచరించారు.
మెడలో రుద్రాక్ష మాలలు వేసుకున్నారు విజయ్ దేవరకొండ. కాషాయ రంగు పంచె కట్టుకున్నారు. షర్ట్ లేకుండా సంప్రదాయబద్ధంగా నదిలో స్నానం చేశారు విజయ్. చేతులు జోడించి నదికి నమస్కరించారు. పూజల్లో కూడా పాల్గొన్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మహా కుంభమేళాకు చాలా మంది సెలెబ్రిటీలు వెళుతున్నారు. పుణ్య స్నానాలు చేస్తున్నారు. తాను ప్రయాగ్‍రాజ్‍కు వెళుతున్నట్టు మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ భార్య ఉపాసన ఇటీవలే పోస్ట్ చేశారు. దగ్గుబాటి రాణా భార్య మహికా బాజాజ్ కూడా మహా కుంభమేళాకు సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి కూడా ప్రయాగ్‍రాజ్ వద్ద పుణ్య స్నానం చేశారు.
వీడీ12 టీజర్‌కు స్టార్ హీరోల వాయిస్ ఓవర్
వీడీ12 టీజర్ ఫిబ్రవరి 12వ తేదీన రానుంది. దీనిపై చాలా క్యూరియాసిటీ నెలకొంది. ఈ టీజర్ హిందీ వెర్షన్‍కు బాలీవుడ్ హీరో రణ్‍బీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇచ్చారని తెలుస్తోంది. తెలుగులో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, తమిళంలో హీరో సూర్య వాయిస్ ఓవర్ ఇచ్చారని రూమర్లు ఉన్నాయి. దీంతో వీడీ12 టీజర్‌పై ఆసక్తి విపరీతంగా ఉంది.
వీడీ12 టీజర్ ద్వారా టైటిల్ కూడా రివీల్ కానుంది. గౌతమ్ తిన్ననూరి ఈ మూవీని ఇంటెన్స్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఈ మూవీలో విజయ్‍కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‍గా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్య్చూన్ ఫోర్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ మూవీని భారీ బడ్జెట్‍తో ప్రొడ్యూజ్ చేస్తున్నారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
సంబంధిత కథనం
టాపిక్