Vijay Deverakonda Motivational Video: 'నచ్చినట్టు జీవించండి' అని అంటోన్న విజయ్.. రౌడీ హీరో వీడియో వైరల్
Vijay Deverakonda Training Video: విజయ్ దేవరకొండ తన అభిమానుల్లో స్ఫూర్తి నింపేలా.. కష్టపడి పని చేయండి అంటూ పోస్ట్ పెట్టాడు. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి అంటూ తను శిక్షణ తీసుకుంటున్న వీడియో ఒకదాన్ని షేర్ చేశాడు.
Vijay Deverakonda Motivational Post: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ విషయాన్నైనా కుండబద్దలుకొట్టినట్లు మాట్లాడమే కాకుండా.. తన సినిమా ఫ్లాపయినా బహిరంగంగా ఒప్పుకునే మనస్తత్వంతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదిస్తున్నాడు. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ హీరో.. ఏ విషయాన్నైనా.. ఇక్కడ నుంచే షేర్ చేస్తుంటాడు. తాజాగా అదిరిపోయే వీడియో ఒకటి తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. అంతేకాకుండా అభిమానుల్లో స్ఫూర్తి నింపేలా.. కష్టపడి పని చేయండి అంటూ పోస్ట్ పెట్టాడు.
ట్రెండింగ్ వార్తలు
"కష్టపడి పనిచేయండి. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. కొత్త నైపుణ్యానలపై దృష్టి పెట్టండి. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోండి. విజయాన్ని ఆస్వాదించండి. మీకు నచ్చినట్లు జీవించండి." అని విజయ్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియోపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. కష్టపడి పనిచేసేవారికి విజయం తప్పకుండా తక్కుందని తెలిపారు. మీరే మాకు స్ఫూర్తి.. నువ్వు తగ్గొద్దూ అంటూ అతడికి మద్దతుగా నిలిచారు. ఇదే సమయంలో అతడిపై మరికొంతమంది ప్రతికూలంగానూ స్పందిస్తున్నారు.
విజయ్ పోస్ట్ చేసిన వీడియో లైగర్ సినిమాకు సంబంధించిన కావడంతో కొంతమంది వ్యగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండ్రూస్ వద్ద విజయ్ శిక్షణ తీసుకున్నారు. వాటిల్లో జంపింగ్‌కు సంబంధించిన దృశ్యాలను ఆయన పంచుకున్నారు. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన లైగర్ గత నెల 25న విడుదలైంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఖుషి అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో సమంత హీరోయిన్‌గా చేస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కొంతభాగం పూర్తి కాగా.. వీలైనంత త్వరగా పూర్తిచేసేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోంది. ఇది కాకుండా పూరి దర్శకత్వంలో జేజీఎం అనే సినిమాను ప్రకటించాడు విజయ్. అయితే లైగర్ ప్లాప్‌తో ఈ సినిమా నిలిచిపోయిందంటూ వార్తలొచ్చాయి. అయితే చిత్రబృందం ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
సంబంధిత కథనం