ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‍కు విజయ్ దేవరకొండ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. బన్నీ అన్నా అంటూ..-vijay deverakonda sends special gift to allu arjun icon star posts on social media ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‍కు విజయ్ దేవరకొండ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. బన్నీ అన్నా అంటూ..

ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‍కు విజయ్ దేవరకొండ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. బన్నీ అన్నా అంటూ..

అల్లు అర్జున్‍కు గిఫ్ట్ పంపారు విజయ్ దేవకొండ. ఈ విషయాన్ని ఇన్‍స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు అల్లు అర్జున్. ఓ పోస్ట్ చేశారు.

ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‍కు విజయ్ దేవరకొండ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. బన్నీ అన్నా అంటూ..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ మధ్య మంచి రిలేషన్ ఉంటుంది. ఒకరిపై ఒకరికి ఉన్న ఇష్టాన్ని కొన్ని సందర్భాల్లో వీరు బయటపెట్టారు. విజయ్ దేవరకొండకు చెందిన క్లాతింగ్ బ్రాండ్ ‘రౌడీ’ బాగా పాపులర్ అయింది. ఈ బ్రాండ్ స్టోర్‌ను రీసెంట్‍గా హైదరాబాద్‍లో ప్రారంభించారు విజయ్. ఈ తరుణంలో అల్లు అర్జున్‍కు ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్ పంపారు.

బన్నీ అన్నా అంటూ.. దుస్తులు, బర్గర్లు

విజయ్ దేవరకొండ తనకు గిఫ్ట్ పంపారంటూ ఇన్‍స్టాగ్రామ్ స్టోరీని నేడు పోస్ట్ చేశారు అల్లు అర్జున్. బన్నీ అన్నా.. కొన్ని రౌడీ బ్రాండింగ్ క్లాత్‍లు, పిల్లలకు బర్గర్లు పంపుతున్నానని విజయ్ దేవరకొండ రాసిన నోట్‍ను కూడా పంచుకున్నారు.

నా స్వీట్ బ్రదర్ అంటూ ఈ ఇన్‍స్టా స్టోరీ పోస్ట్ చేశారు అల్లు అర్జున్. విజయ్ దేవరకొండకు ట్యాగ్ చేశారు. “మై స్వీట్ బ్రదర్.. ఎప్పుడో ఏదో ఒకటి పంపుతుంటావ్. సో స్వీట్” అని క్యాప్షన్ రాశారు అల్లు అర్జున్.

సోషల్ మీడియాలో వైరల్

విజయ్ దేవరకొండ గిఫ్ట్ పంపాడంటూ అల్లు అర్జున్ షేర్ చేసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరు చూపించుకుంటున్న ప్రేమను చూసి ఆ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ముచ్చటపడుతున్నారు. పుష్ప 2 రిలీజ్ సమయంలోనూ అల్లు అర్జున్‍కు స్పెషల్ టీ షర్టులు పంపారు విజయ్. అప్పుడు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కృతజ్ఞతలు తెలిపారు అల్లు అర్జున్. ఇప్పుడు మరోసారి సర్‌ప్రైజ్ గిఫ్ట్ సెండ్ చేశారు విజయ్.

సినిమాలు ఇలా..

పుష్ప 2 భారీ బ్లాక్‍బస్టర్ తర్వాత తమిళ డైరెక్టర్ అట్లీతో మూవీ చేసేందుకు అల్లు అర్జున్ రెడీ అయ్యారు. ఇటీవలే వచ్చిన ఈ మూవీ అనౌన్స్‌మెంట్ స్పెషల్ వీడియో హైప్ విపరీతంగా పెంచేసింది. హాలీవుడ్ రేంజ్‍లో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా అల్లు అర్జున్ - అట్లీ మూవీ ఉంటుందనే అంచనాలు వెలువడుతున్నాయి. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని పొడ్యూజ్ చేయనుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలయ్యే అవకాశం ఉంది.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్‍డమ్ చిత్రం చేస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. టీజర్ తర్వాత ఈ చిత్రంపై అంచనాలు బాగా పెరిగాయి. ఈ చిత్రం ఈ ఏడాది మే 30వ తేదీన విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‍గా చేస్తున్నారు. ఈ మూవీని సితారా ఎంటర్‌టైన్‍మెంట్స్, పార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు ప్రొడ్యూజ్ చేస్తున్నారు.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం