Vijay Deverakonda: నేను, మా తమ్ముడు అలా మా గర్ల్‌ఫ్రెండ్స్‌తో ఆడుకునే వాళ్లం: విజయ్ దేవరకొండ-vijay deverakonda says he and his brother anand deverakonda with same voice used to prank our girlfriends ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijay Deverakonda: నేను, మా తమ్ముడు అలా మా గర్ల్‌ఫ్రెండ్స్‌తో ఆడుకునే వాళ్లం: విజయ్ దేవరకొండ

Vijay Deverakonda: నేను, మా తమ్ముడు అలా మా గర్ల్‌ఫ్రెండ్స్‌తో ఆడుకునే వాళ్లం: విజయ్ దేవరకొండ

Hari Prasad S HT Telugu
May 22, 2024 03:22 PM IST

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. గం గం గణేశా ప్రెస్ మీట్ లో ఫోన్ కాల్ లో అతడు ప్రెస్ తో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఆనంద్ ది, తనది వాయిస్ ఒకేలా ఉండటంపై స్పందించాడు.

నేను, మా తమ్ముడు అలా మా గర్ల్‌ఫ్రెండ్స్‌తో ఆడుకునే వాళ్లం: విజయ్ దేవరకొండ
నేను, మా తమ్ముడు అలా మా గర్ల్‌ఫ్రెండ్స్‌తో ఆడుకునే వాళ్లం: విజయ్ దేవరకొండ

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ హీరో అయిన తర్వాత అతన్ని ఇమిటేట్ చేసే ఫ్యాన్స్ ఎంతోమంది ఉన్నారు. ఇక సొంత తమ్ముడైన ఆనంద్ దేవరకొండ చేయడా? తాజాగా అతని గం గం గణేశా మూవీ ట్రైలర్ రిలీజైన సంగతి తెలుసు కదా. ఇందులో ఆనంద్ చాలా వరకు విజయ్ వాయిస్, యాక్టింగ్ ను ఇమిటేడ్ చేస్తున్నాడంటూ మీడియా అడిగింది. ఆ తర్వాత జరిగిన సీన్ చాలా ఇంట్రెస్టింగా ఉంది.

ప్రెస్ మీట్‌లోకి విజయ్

గం గం గణేశా ట్రైలర్ చూసిన తర్వాత మీరు మీ అన్న విజయ్ దేవరకొండ వాయిస్, డిక్షన్ ఇమిటేట్ చేస్తున్నట్లుగా అనిపిస్తోంది అని మీడియా వాళ్లు ఆనంద్ ను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఎలా సమాధానం చెప్పాలా అని ఆనంద్ ఆలోచిస్తుండగా.. నేరుగా విజయ్ తోనే ఫోన్ మాట్లాడి క్లారిటీ తీసుకుంటే అయిపోతుంది కదా అనుకొని అతనికే ఆనంద్ కాల్ చేశాడు.

ఈ సందర్భంగా విజయ్ చెప్పిన విషయం విని అక్కడున్న వాళ్లంతా షాక్ తిన్నారు. తమ చిన్నతనంలోనే తమ తల్లి ద్వారా ఇద్దరి వాయిస్ ఒకేలా ఉందని తెలుసుకున్నామని, ఆ తర్వాత దానిని అదునుగా తీసుకొని ఫ్రెండ్స్, గర్ల్‌ఫ్రెండ్స్ తో ఆడుకునే వాళ్లమని విజయ్ చెప్పడం విశేషం.

నా గర్ల్‌ఫ్రెండ్స్‌తో ఆనంద్ మాట్లాడేవాడు

ఎవరి గర్ల్‌ఫ్రెండ్స్ తో ఎవరు మాట్లాడేవారు అని ప్రశ్నించగా.. తనకు గర్ల్ ఫ్రెండ్ లేదని ఆనంద్ చెప్పాడు. దీంతో విజయ్ స్పందిస్తూ.. తన గర్ల్ ఫ్రెండ్స్ లో ఆనంద్ మాట్లాడేవాడని, ఇద్దరి వాయిస్, డిక్షన్ ఒకేలా ఉండటంతో అవతలి వాళ్లు గుర్తుపట్టలేకపోయేవారని విజయ్ తెలిపాడు. తాను ఎప్పుడు రిలేషన్షిప్ లో ఉన్నా ఆనంద్ ఇలాగే చేసేవాడని విజయ్ నవ్వుతూ చెప్పాడు.

ఇక తన బదులు కొన్నిసార్లు ఆనంద్ ను డబ్బింగ్ చెప్పడానికి కూడా పంపుదామని అనుకున్నానని విజయ్ చెప్పగా.. పంపించావుగా అని ఆనంద్ అన్నాడు. అయితే అది ఎప్పుడు, ఏ సినిమా అని మాత్రం చెప్పలేదు. గం గం గణేశా ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉందని కూడా ఈ సందర్భంగా విజయ్ అన్నాడు. ఈ మూవీ మే 31న రిలీజ్ కానుంది. బేబి మూవీ తర్వాత ఆనంద్ దేవరకొండ నటించిన సినిమా ఇది.

పోలికలు వద్దు: ఆనంద్ దేవరకొండ

ఇక ప్రస్తుతం అభిమానులు కూడా పోటీ కాకుండా పోలికలు చూస్తున్నారని, దీని వల్ల మంచి సినిమాలను సెలబ్రేట్ చేసుకోకుండా వదిలేస్తున్నామని ఆనంద్ దేవరకొండ అన్నాడు. అభిమానులు కూడా నంబర్లు చూసి మాట్లాడుతుండటం సరి కాదని, ఈ నెగటివ్ వైబ్ ప్రభావం చూపిస్తుందని అతడు అభిప్రాయపడ్డాడు. ఈ పోలికల వల్ల మంచి సినిమాలను సెలబ్రేట్ చేసుకోవడం కూడా మరచిపోతున్నామని చెప్పాడు.

గం గం గణేశా మూవీ ఓ విగ్రహం చోరీ చుట్టూ తిరిగే కథలా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమా మే 31 విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, కాజల్ సత్యభామతోపాటు మరో రెండు చిన్న సినిమాలతో పోటీ పడనుంది.

టీ20 వరల్డ్ కప్ 2024