Vijay Deverakonda: యూట్యూబ్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న డిజాస్టర్ మూవీకి 400 మిలియన్ల వ్యూస్
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటించిన డియర్ కామ్రేడ్ మూవీ హిందీ వెర్షన్ యూట్యూబ్‌లో 400 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకొని రికార్డ్ క్రియేట్ చేసింది.
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ రష్మిక మందన్న జంటగా నటించిన డియర్ కామ్రేడ్ మూవీ యూట్యూబ్‌లో అదరగొడుతోంది. రొమాంటిక్ లవ్‌స్టోరీ తెరకెక్కిన ఈ మూవీ హిందీ వెర్షన్ యూట్యూబ్ లో 400 మిలియన్స్ కు పైగా వ్యూస్ ను సొంతం చేసుకున్నది.
యూట్యూబ్‌లో హిందీలో డబ్ అయిన తెలుగు సినిమాల్లో హయ్యెస్ట్ వ్యూస్ దక్కించుకున్న సినిమాల్లో ఒకటిగా డియర్ కామ్రేడ్ నిలిచింది. గోల్డ్ మైన్స్ యూట్యూబ్ ఛానెల్ 2020 జనవరి 19 డియర్ కామ్రేడ్ మూవీ హిందీ వెర్షన్ ను అప్ లోడ్ చేసింది. విజయ్, రష్మిక మూవీ 150 భాషల్లో సబ్ టైటిల్స్ తో అందుబాటులో ఉండటం విశేషం.
గీత గోవిందం సక్సెస్ తర్వాత...
గీత గోవిందం సక్సెస్ తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి చేసిన సినిమా ఇది. అప్పటికే విజయ్ బ్యాక్ టూ బ్యాక్ సక్సెసులను అందుకోవడం, టీజర్స్, ట్రైలర్స్ లో విజయ్, రష్మిక కెమిస్ట్రీ, లిప్‌లాక్‌లతో పాటు సినిమా ప్రమోషన్స్ డిఫరెంట్‌గా చేయడంతో డియర్ కామ్రేడ్‌పై పాన్ ఇండియన్ లెవెల్‌లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. కానీ కథలో కొత్తదనం లేకపోవడంతో ఈ సినిమా ఆ అంచనాల్ని అందుకోలేక డిజాస్టర్‌గా నిలిచింది.
టాలీవుడ్ ఎంట్రీ...
డియర్ కామ్రేడ్ మూవీతో భరత్ కమ్మ దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసింది. విజయ్ రష్మిక జోడీకి ఉన్న క్రేజ్ కారణంగా అప్పట్లో డియర్ కామ్రేడ్ మూవీ తొలిరోజు 18 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. నెగెటివ్ టాక్ కారణంగా వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ఫుల్ థియేట్రికల్ రన్‌లో 37 కోట్ల కలెక్షన్స్‌తో ఈ మూవీ సరిపెట్టుకున్నది.
నాలుగు ఫ్లాప్స్...
డియర్ కామ్రేడ్‌తోనే విజయ్ దేవరకొండ బ్యాడ్‌టైమ్ స్టార్టయింది. ఈ మూవీతో పాటు ఆ తర్వాత చేసిన లైగర్, వరల్డ్ ఫేమస్ లవర్, ఖుషితో పాటు ఇటీవల రిలీజైన ఫ్యామిలీ స్టార్ కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.
యాభై కోట్ల బడ్జెట్...
గీతగోవిందం తర్వాత విజయ్ దేవరకండ, డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్‌లో వచ్చిన ఫ్యామిలీ స్టార్ ఈ ఏడాది ఏప్రిల్ 5న రిలీజైంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దిల్‌రాజు ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ ఆయనకు భారీగా నష్టాలను మిగిల్చింది. యాభై కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 20 కోట్ల లోపే వసూళ్లను సాధించింది.
మూడు సినిమాలతో బిజీ
గత సినిమాల రిజల్ట్‌లతో సంబంధం లేకుండా ప్రస్తుతం విజయ్ మూడు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో ఓ స్పై థ్రిల్లర్ మూవీ చేస్తోన్నాడు విజయ్ దేవరకొండ. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
అలాగే ఫ్యామిలీ స్టార్ తర్వాత దిల్ రాజు బ్యానర్‌లో ఓ యాక్షన్ మూవీ చేయబోతున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాకు రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నాడు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ట్యాక్సీవాలా దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్‌తో ఓ పీరియాడికల్ మూవీకి విజయ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు.
మరోవైపు తెలుగులో పుష్ప 2, ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాలు చేస్తోంది రష్మిక మందన్న. హిందీలో సికిందర్ మూవీలో సల్మాన్‌ఖాన్‌కు జోడీగా నటిస్తోంది.