Family Star OTT: అనుకున్నదానికంటే ముందుగానే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్ - స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
Family Star OTT: విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ ఓటీటీలోకి రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మే 3 న అమెజాన్ ప్రైమ్‌లో ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కానున్నట్లు సమాచారం.

Family Star OTT: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్ త్వరలోనే ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్ కాంబోలో తెరకెక్కిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నది.
పది రోజుల కలెక్షన్స్...
పది రోజుల్లో 19.40 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. తొలిరోజు ఐదున్నర కోట్ల కలెక్షన్స్ దక్కించుకొని పర్వాలేదనిపించింది. కానీ నెగెటివ్ టాక్ కారణంగా రోజురోజుకు వసూళ్లు తగ్గుముఖం పడుతూ వచ్చాయి. ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు నలభై మూడు కోట్ల వరకు జరిగింది. నలభై ఐదు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ మూవీ రిలీజైంది. విజయ్ దేవరకొండ మూవీ లాభాల్లో అడుగుపెట్టాలంటే మరో ఇరవై ఐదు కోట్ల వరకు కలెక్షన్స్ రావాల్సిఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి.
మే 3న ఓటీటీలోకి...
కాగా ఫ్యామిలీ స్టార్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మే 3న ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. ఫ్యామిలీ స్టార్ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నది. ఏప్రిల్ నెలాఖరున ఫ్యామిలీ స్టార్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మృణాల్ ఠాకూర్ హీరోయిన్...
ఫ్యామిలీ స్టార్ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. జగపతిబాబు కీలక పాత్ర పోషించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఫ్యామిలీ స్టార్ మూవీని ప్రొడ్యూస్ చేశాడు.
ఫ్యామిలీ స్టార్ కథ ఇదే...
గోవర్ధన్ (విజయ్ దేవరకొండ) ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసే అతడిపై కుటుంబబాధ్యతలు బోలెడు ఉంటాయి. గోవర్ధన్ ఇంట్లోకి ఇందు (మృణాల్ ఠాకూర్) అద్దెకు దిగుతుంది. ఓ అవసరం నిమిత్తం గోవర్దన్‌తో క్లోజ్‌గా మూవ్ అవుతుంది. ఇందు మంచితనం చూసి ఆమెతో ప్రేమలో పడతాడు గోవర్ధన్.
అంత సాఫీగా సాగిపోతున్న తరుణంలో ఇందు దాచిన రహస్యం గోవర్ధన్‌కు తెలిసిపోతుంది? ఆ రహస్యం ఏమిటి? గోవర్ధన్ జీవితంపై ఇందు ఓ బుక్ ఎందుకు రాసింది?ఓ ప్రాజెక్ట్ పని కోసం అమెరికా వెళ్లిన గోవర్ధన్ వెంట ఇందు కూడా ఎందుకు వెళ్లింది? అపోహలు తొలగిపోయి గోవర్ధన్, ఇందు ఎలా ఒక్కటయ్యారన్నదే ఈ మూవీ కథ.
మ్యాజిక్ మిస్...
గీతగోవిందం సినిమాలో హీరోహీరోయిన్ల కెమిస్ట్రీతో పాటు కామెడీ, లవ్‌స్టోరీతో పాటు పాటలు వర్కవుట్ అయ్యాయి. మరోసారి అదే ఫార్ములాను నమ్మి పరశురామ్ ఫ్యామిలీ స్టార్ మూవీ చేశాడు. కానీ కథలో పస లేకపోవడంలో ఫ్యామిలీ స్టార్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయింది.
స్పై యాక్షన్ మూవీ...
ఫ్యామిలీ స్టార్ తర్వాత గౌతమ్ తిన్ననూరితో స్పై యాక్షన్ మూవీ చేస్తోన్నాడు విజయ్ దేవరకొండ. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న ఈ మూవీలో హీరోయిన్‌గా ప్రేమలు ఫేమ్ మమితా బైజుతో పాటు భాగ్యశ్రీ బోర్సే పేరు కూడా వినిపిస్తోంది.