Liger Box office Collections Day2: లైగర్‌కు రెండో రోజు షాకింగ్ కలెక్షన్లు..!-vijay deverakonda liger collections huge drop on day 2 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Vijay Deverakonda Liger Collections Huge Drop On Day 2

Liger Box office Collections Day2: లైగర్‌కు రెండో రోజు షాకింగ్ కలెక్షన్లు..!

Maragani Govardhan HT Telugu
Aug 27, 2022 11:08 AM IST

విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రం వసూళ్లు భారీగా పతనమయ్యాయి. రెండో రోజుకు చాలా వరకు కలెక్షన్ల డ్రాప్ జరిగింది. మొత్తంగా రూ.15 నుంచి 16 కోట్ల వరకు కలెక్షన్లను సాధించిందని అంచనా.

లైగర్ కలెక్షన్లు
లైగర్ కలెక్షన్లు (Twitter)

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా లైగర్. అనన్యా పాండే ఇందులో హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు వసూళ్ల పరంగా మెరుగైన కలెక్షన్లను సాధించిందీ చిత్రం. అయితే సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో రెండో రోజు వసూళ్ల పరంగా భారీగా పతనమయ్యాయి. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో లైగర్ కలెక్షన్ల డ్రాప్ ఘోరంగా సంభవించింది.

తొలి రోజు రూ.33 కోట్లను వసూలు చేసిన లైగర్.. రెండో రోజుకు భారీగా కలెక్షన్ల డ్రాప్ అయ్యాయి. శుక్రవారం నాటికి లైగర్ సినిమా అన్ని భాషల్లో కలిపి 15 నుంచి 16 కోట్ల వరకు వసూలు చేసినట్లు ట్రేడ్ పండితులు అంచనా వేశారు. హిందీ బెల్టులో ఈ వసూళ్ల పతనంగా ఘోరంగా ఉంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

అన్ని భాషల్లో కలిపి లైగర్ నెట్ వసూళ్లను పరిశీలిస్తే.. తొలి రోజు రూ.16 కోట్ల నెట్ రాబడి ఉంటే.. రెండో రోజు నాటికి రూ.7.4 కోట్ల వసూళ్లు లభించాయి. సినిమాకు విడుదలైన రోజు నుంచే నెగిటివ్ టాక్ రావడంతో ఆ ప్రభావం వసూళ్లపై పడింది. బాలీవుడ్‌లో చాలా థియేటర్లలో లో ఆక్యుపెన్సీతో థియేటర్లు ఖాళీ అయ్యాయి.

విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రం గురువారం విడుదలైంది. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఆయనతో పాటు కరణ్‌ జోహార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇది విజయ్‌కు హిందీలో తొలి చిత్రం. రమ్య కృష్ణ ఇందులో రౌడీ హీరోకు తల్లి పాత్రలో కనిపించింది. అనన్యా పాండే హీరోయిన్ కాగా.. రోనిత్ రాయ్ విజయ్‌కు కోచ్‌ పాత్రలో కనిపించారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా ఏకకాలంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం