liger box office collection day 4: నాలుగో రోజు లైగ‌ర్‌కు షాకింగ్ క‌లెక్ష‌న్స్ - బ్రేక్ ఈవెన్ కావ‌డం అసాధ్య‌మే-vijay deverakonda liger collections drastically drop on fourth day ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Vijay Deverakonda Liger Collections Drastically Drop On Fourth Day

liger box office collection day 4: నాలుగో రోజు లైగ‌ర్‌కు షాకింగ్ క‌లెక్ష‌న్స్ - బ్రేక్ ఈవెన్ కావ‌డం అసాధ్య‌మే

HT Telugu Desk HT Telugu
Aug 29, 2022 11:46 AM IST

liger box office collection day 4:విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)హీరోగా నటించిన లైగర్ (Liger) సినిమా వసూళ్లు నాలుగో రోజు దారుణంగా పడిపోయాయి. ఆదివారం రోజు ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు ఎంతంటే...

విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ (Twitter)

liger box office collection day 4: లైగర్ సినిమా వసూళ్లు నాలుగు రోజు పూర్తిగా పడిపోయాయి. ఆదివారం కావడంతో మోస్తారుగానైనా ఈ సినిమా వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ ఊహించని విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం రోజు లైగర్ సినిమాకు కేవలం 58 లక్షల షేర్ ను మాత్రమే రాబట్టింది.

శనివారం రోజు కోటి రూపాయల షేర్ ను రాబట్టగా ఆదివారం రోజు సగానికి తగ్గడం ట్రేడ్ వర్గాలను విస్మయపరుస్తోంది. ఆదివారం రోజు నైజాంలో ఇరవై లక్షల వసూళ్లు మాత్రమే వచ్చాయి. మొత్తంగా సండే నాడు కోటి పదిహేను లక్షల గ్రాస్, 58 లక్షల షేర్ ను ఈ సినిమా రాబట్టింది. నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 21.50 కోట్ల గ్రాస్, వరల్డ్ వైడ్ గా 50 కోట్ల గ్రాస్ ను రాబట్టింది.

హిందీలో నాలుగు రోజుల్లో ఈ సినిమాకు 6.25 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. ఓవర్ సీస్ లో 3.30 కోట్ల వసూళ్లను సాధించింది. తొలిరోజు లైగర్ సినిమాకు వసూళ్లు బాగానే ఉన్నా నెగెటివ్ టాక్ కారణంగా రోజురోజుకు వసూళ్లు తగ్గుతూ వచ్చాయి.

నాలుగో రోజుకు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ఎగ్జిబిటర్లకు ఈ సినిమా భారీగా నష్టాలను మిగిల్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ సినిమాను తెరకెక్కించాడు. అనన్యా పాండే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతోనే విజయ్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి అడుగులోనే అతడికి డిజాస్టర్ ఎదురైంది.

IPL_Entry_Point