Kushi Movie Postponed: విజ‌య్‌, స‌మంత ఖుషి రిలీజ్ డేట్ మార‌నుందా - కార‌ణం ఇదేనా-vijay deverakonda kushi movie likely to get postponed next year summer ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Vijay Deverakonda Kushi Movie Likely To Get Postponed Next Year Summer

Kushi Movie Postponed: విజ‌య్‌, స‌మంత ఖుషి రిలీజ్ డేట్ మార‌నుందా - కార‌ణం ఇదేనా

Nelki Naresh Kumar HT Telugu
Oct 28, 2022 06:20 AM IST

Kushi Movie Postponed: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత జంట‌గా న‌టిస్తోన్న ఖుషి త‌దుప‌రి షెడ్యూల్ న‌వంబ‌ర్ రెండోవారం నుంచి ప్రారంభం కానున్న‌ట్లు స‌మాచారం. కాగా ఈ సినిమా రిలీజ్ పోస్ట్‌పోన్ అయ్యే అవ‌కాశం ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత
విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత

Kushi Movie Postponed: మ‌హాన‌టి త‌ర్వాత విజ‌య్‌దేవ‌ర‌కొండ‌ (Vijay Deverakonda), స‌మంత (Samantha)క‌లిసి న‌టిస్తోన్న చిత్రం ఖుషి. క‌శ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీగా రూపొందుతోన్న ఈ సినిమాకు శివ‌నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఖుషి సినిమాను డిసెంబ‌ర్ 23న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు గ‌తంలో చిత్ర నిర్మాత‌లు ప్ర‌క‌టించారు.

కానీ షూటింగ్ ఆల‌స్యం కావ‌డంతో ఈ సినిమా వాయిదాప‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. డిసెంబ‌ర్ 23న కాకుండా వ‌చ్చే ఏడాది వేస‌విలో ఖుషి సినిమాను రిలీజ్ చేయాల‌నే ఆలోచ‌న‌లో చిత్ర యూనిట్ ఉన్న‌ట్లు చెబుతున్నారు.

తొలుత న‌వంబ‌ర్ లోగా షూటింగ్ పూర్తిచేయాల‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ప్లాన్ చేశారు. కానీ స‌మంత, విజ‌య్ డేట్స్ అడ్జెస్ట్‌మెంట్ కాక‌పోవ‌డంతో షూటింగ్ ఆల‌స్య‌మైన‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమా త‌దుప‌రి షెడ్యూల్ న‌వంబ‌ర్ 15 నుంచి మొద‌లుకానున్న‌ట్లు చెబుతున్నారు. ఈ షెడ్యూల్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత పాల్గొన‌నున్న‌ట్లు స‌మాచారం.

హైద‌రాబాద్‌తో పాటు కేర‌ళ‌లో ఈ షెడ్యూల్‌ను చిత్రీక‌రించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియ‌న్ స్థాయిలో ద‌క్షిణాది భాష‌ల‌తో పాటు హిందీలో ఖుషి సినిమాను రిలీజ్ చేయ‌బోతున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తోంది.

ఖుషితో పాటుగా స‌మంత తెలుగులో య‌శోద‌, శాకుంత‌లం సినిమాల్లో న‌టిస్తోంది. మ‌రోవైపు విజ‌య్ దేవ‌ర‌కొండ పూరి జ‌గ‌న్నాథ్‌తో జ‌న‌గ‌న‌మ‌ణ సినిమాను అంగీక‌రించాడు.

IPL_Entry_Point