విజయ్ దేవరకొండ ‘కింగ్‍డమ్’కు వీరమల్లు టెన్షన్.. డైలమాలో మూవీ టీమ్!-vijay deverakonda kingdom in dilemma with hari hara veera mallu uncleared plans ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  విజయ్ దేవరకొండ ‘కింగ్‍డమ్’కు వీరమల్లు టెన్షన్.. డైలమాలో మూవీ టీమ్!

విజయ్ దేవరకొండ ‘కింగ్‍డమ్’కు వీరమల్లు టెన్షన్.. డైలమాలో మూవీ టీమ్!

కింగ్‍డమ్ సినిమాకు కొత్త టెన్షన్ పట్టుకుంది. హరి హర వీరమల్లు మళ్లీ ట్రాక్‍లోకి వచ్చేయడంతో రిలీజ్ మార్చుకోవాలా అనే గందరగోళం ఏర్పడింది. ప్రమోషన్లు చేసేందుకు క్లారిటీ లేదు. ఆ వివరాలు ఇవే..

విజయ్ దేవరకొండ ‘కింగ్‍డమ్’కు వీరమల్లు టెన్షన్.. డైలమాలో మూవీ టీమ్!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘కింగ్‍డమ్’ సినిమా ఈ మే 30వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ప్రమోషన్లకు కూడా మూవీ టీమ్ రెడీ అవుతోంది. ఇప్పటికే ఓ సాంగ్ వచ్చింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ మూవీకి మంచి క్రేజ్ ఉంది. అయితే, కిండ్‍గమ్‍కు ఇప్పుడు పవన్ కల్యాణ్ ‘హరి హర వీరమల్లు’ టెన్షన్ పట్టుకుంది. ప్రమోషన్లు చేసేందుకు కూడా క్లారిటీ లేక డైలమా నెలకొన్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు ఇవే..

వీరమల్లు వస్తే వాయిదా తప్పదు

హరి హర వీరమల్లు సినిమా కోసం కాస్త పెండింగ్‍లో ఉన్న షూటింగ్‍ను పూర్తి చేసేందుకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవలే సెట్స్‌లోకి వెళ్లారు. ఒకటి రెండు రోజుల్లో షూటింగ్ కంప్లీట్ కానుంది. దీంతో హరి హర వీరమల్లు చిత్రం మే 30వ తేదీన విడుదలయ్యేందుకు సిద్ధమవుతోందనే టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఇదే జరిగితే కింగ్‍డమ్ వాయిదా పడకతప్పదు. ఒకవేళ జూన్‍ను వీరమల్లు ఎంపిక చేసుకుంటే ఊరట లభిస్తుంది.

క్లారిటీ కోసం ‘కింగ్‍డమ్’ వెయిటింగ్

హరి హర వీరమల్లు రిలీజ్ డేట్‍పై క్లారిటీ కోసం కింగ్‍డమ్ టీమ్ ప్రస్తుతం వేచిచూస్తోంది. త్వరగా స్పష్టత వస్తే ప్రమోషన్లను ప్లాన్ చేసుకోవాలని ఆలోచిస్తోంది. విడుదల తేదీని వీరమల్లు మేకర్లు మరో వారంలోగా ప్రకటిస్తారనే అంచనాలు ఉన్నాయి. షూటింగ్ పూర్తికాగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులను అంచనా వేసుకొని రిలీజ్‍ను అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ మే 30న వీరమల్లు వస్తే వాయిదా వేసుకోవడం తప్ప కింగ్‍డమ్‍కు మరో ఆప్షన్ ఉండదు.

ఓటీటీ డీల్‍తోనూ..

హరి హర వీరమల్లు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. అయితే, ఈ సినిమాను మే 30వ తేదీన థియేటర్లలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేయాలని మూవీ టీమ్‍ను ఆ ప్లాట్‍ఫామ్ ఒత్తిడి చేస్తోందనే టాక్ కూడా టాలీవుడ్‍ వర్గాల్లో తిరుగుతోంది. జూన్ రెండో వారం అనే ఆలోచన వీరమల్లు టీమ్‍లో ఉన్నా.. స్ట్రీమింగ్ విండో ప్లానింగ్ కోసం మే 30నే థియేటర్లలో రిలీజ్ చేయాలని ప్రైమ్ వీడియో అడుగుతోందట. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.

కింగ్‍డమ్ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఫుల్ స్పై యాక్షన్ ప్యాక్డ్ మూవీగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్నారు.

పీరియాడిక్ యాక్షన్ మూవీ హరి హర వీరమల్లు నుంచి డైరెక్టర్ క్రిష్ తప్పుకున్నాక.. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేస్తోంది. ఎంఎం కీరవాణి మ్యూజిక్ ఇస్తున్నారు.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం