Vijay Deverakonda : నోరుమూసుకుని చూడాలి.. చిరంజీవి, రజనీపై విజయ్ దేవరకొండ కామెంట్స్
Vijay Deverakonda On Chiranjeevi : విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించిన చిత్రం ఖుషి. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ బిజీగా ఉన్నాడు. కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ప్రస్తుతం పాన్-ఇండియన్ రొమాంటిక్ డ్రామా అయిన ఖుషి చిత్రం(Kushi Cinema) ప్రమోషన్‌లలో నిమగ్నమై ఉన్నాడు. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సమంతా రూత్ ప్రభు కథానాయికగా నటించింది. సెప్టెంబర్ 1, 2023న థియేటర్లలో విడుదల కానుంది. తమిళనాడులో ఖుషి సినిమా ప్రమోషన్స్‌లో ఉన్న విజయ్ ని ఓ జర్నలిస్ట్ చిరంజీవి గురించి నెగిటివ్‌గా అడిగాడు.
ట్రెండింగ్ వార్తలు
విజయ్ దేవరకొండ మర్యాదపూర్వకంగా సమాధానం ఇచ్చాడు. సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth), చిరంజీవి(Chiranjeevi) హిట్, ఫ్లాప్‌లకు అతీతంగా ఉన్నారని అన్నాడు విజయ్. 'రజినీకాంత్ సార్ 5-6 బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్‌లు ఇచ్చాడు. కానీ జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ తో మళ్లీ తిరికి వచ్చాడు. అలాంటప్పుడు మనం నోరుమూసుకుని చూడాలి.' అని అన్నాడు విజయ్ దేవరకొండ.
చిరంజీవి గురించి మాట్లాడుతూ 'చిరంజీవి గారికి బ్యాక్ టు బ్యాక్ 6-7 ఫ్లాప్‌లు ఉండవచ్చు. అయితే సరైన దర్శకుడు తన ఎనర్జీని అందుకుంటే, ఈ సంక్రాంతికి చేసినట్లే సెన్సేషన్‌తో మళ్లీ వస్తారు. చిరు సార్ ఇండస్ట్రీని మార్చేశారు. ఆయన వచ్చాక అక్కడ ఉండే యాక్షన్, డ్యాన్స్, పర్ఫార్మెన్స్ అన్నీ పూర్తిగా మారిపోయాయి. ఇండస్ట్రీలోకి రావడానికి ఆయన ఎంతో మందిని ప్రేరేపించారు. చాలా మంది ఆయనను చూసే సినిమాల్లోకి వచ్చాం.' అని విజయ్ దేవరకొండ అన్నాడు.
హిట్లు, ఫ్లాప్‌ల ఆధారంగా నటులను అంచనా వేయకూడని చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda). ప్రతి ఒక్కరూ తమ సినిమాలను ఆస్వాదించేలా, పరిశ్రమలోకి రావడానికి చాలా మందికి స్ఫూర్తిగా ఉన్నందుకు.. వారిని గౌరవించాలని తెలిపాడు. సీనియర్ నటులపై కామెంట్స్ చేయడం అగౌరవంగా భావిస్తున్నానని తెలిపాడు. వారు గొప్పవారు.. మనం వారిని గౌరవించాలని విజయ్ దేవరకొండ అన్నాడు. విక్రమ్‌తో కమల్ సర్, జైలర్‌తో రజనీ సార్‌ని చూడటం చాలా ఆనందంగా ఉందని ఆనందం వ్యక్తం చేశాడు.
జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు విజయ్ సమాధానమిచ్చిన తీరు చిరు అభిమానులతో పాటు కోట్లాది మంది హృదయాలను గెలుచుకుంది. సీనియర్ నటుల పట్ల విజయ్ దేవరకొండకు ఉన్న గౌరవం గురించి చాలా మంది ప్రశంసిస్తున్నారు.
ఇక ఖుషి సినిమా కోసం విజయ్ దేవరకొండ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తు్న్నారు. లవ్ స్టోరీలు అందంగా తెరకెక్కించే.. శివ నిర్వాణ(Shiva Nirvana) దర్శకత్వం, మరోవైపు సమంత(Samantha) హీరోయిన్ కావడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 1వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ఖుషి పాటలు అందరినీ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ట్రైలర్ కూడా బాగుంది. పాన్ ఇండియా లెవెల్ లో వస్తున్న ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాలని చూస్తున్నాడు విజయ్ దేవరకొండ.