విజయ్ దేవరకొండకు యాక్సిడెంట్.. కారును ఢీకొట్టిన మరో వెహికిల్.. హైదరాబాద్ వస్తుండగా..-vijay deverakonda car met with an accident while returning from puttaparthi to hyderabad ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  విజయ్ దేవరకొండకు యాక్సిడెంట్.. కారును ఢీకొట్టిన మరో వెహికిల్.. హైదరాబాద్ వస్తుండగా..

విజయ్ దేవరకొండకు యాక్సిడెంట్.. కారును ఢీకొట్టిన మరో వెహికిల్.. హైదరాబాద్ వస్తుండగా..

Hari Prasad S HT Telugu

విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం జరిగింది. రష్మికతో ఎంగేజ్‌మెంట్ తర్వాత పుట్టపర్తి వెళ్లిన అతడు తిరిగి హైదరాబాద్ వస్తుండగా.. జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రమాదం జరగగా.. అతని కారు ముందు భాగం దెబ్బతింది.

విజయ్ దేవరకొండకు యాక్సిడెంట్.. కారును ఢీకొట్టిన మరో వెహికిల్.. హైదరాబాద్ వస్తుండగా..

టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ ప్రమాదానికి గురయ్యాడు. ఏపీలోని పుట్టపర్తి నుంచి హైదరాబాద్ తిరిగి వస్తుండగా.. అతడు ప్రయాణిస్తున్న కారును మరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి విజయ్ తృటిలో తప్పించుకున్నట్లు తెలిసింది. అతనికి ఎలాంటి గాయాలు కాలేదు.

విజయ్ దేవరకొండకు ప్రమాదం

విజయ్ దేవరకొండ పుట్టపర్తి నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో నేషనల్ హైవే 44పై తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో విజయ్ కారును పక్క నుంచి మరో వాహనం ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

విజయ్ కారును ఢీకొట్టిన తర్వాత కూడా అవతలి వెహికిల్ ఆపకుండా అలాగే హైదరాబాద్ వెళ్లిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విజయ్ కారు డ్రైవర్ ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాద సమయంలో అతడు ఖరీదైన లెక్సస్ కారులో ప్రయాణిస్తున్నాడు.

పుట్టపర్తికి విజయ్

సెలబ్రిటీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గత వారం హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారని అతని టీమ్ ధృవీకరించింది. నిశ్చితార్థం తర్వాత విజయ్ తన కుటుంబంతో కలిసి పుట్టపర్తిలోని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మహా సమాధిని సందర్శించాడు. విజయ్ ఆదివారం (అక్టోబర్ 5) పుట్టపర్తి వెళ్లాడు. అతని పీఆర్ఓ తన సోషల్ మీడియాలో పుట్టపర్తి సందర్శనకు సంబంధించిన ఒక వీడియోను పోస్ట్ చేస్తూ.. "దివ్య ఆశీస్సుల కోసం విజయ్ దేవరకొండ.. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మహా సమాధిని పుట్టపర్తిలో సందర్శించాడు" అని రాశారు.

ఈ వీడియోలో నటుడితో పాటు అతని సోదరుడు, నటుడు ఆనంద్ దేవరకొండ, తల్లిదండ్రులు గోవర్ధన్ రావు, మాధవి ఉన్నారు. పుట్టపర్తి మేనేజ్‌మెంట్ అతనికి స్వాగతం పలికి శ్రీ సత్యసాయిబాబా ఫొటోను, ఒక బొకేను అందజేసి లోపలికి తీసుకెళ్లారు. అయితే అభిమానులందరి కళ్ళు మాత్రం అతని చేతి వేలికి ఉన్న ఎంగేజ్‌మెంట్ రింగుపైనే ఉన్నాయి.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రిలేషన్‌షిప్

విజయ్, రష్మిక 2018లో వచ్చిన హిట్ మూవీ ‘గీత గోవిందం’లో కలిసి పనిచేసినప్పటి నుండి డేటింగ్‌లో ఉన్నారనే వదంతులు వినిపిస్తున్నాయి. 2019లో వచ్చిన 'డియర్ కామ్రేడ్' మూవీలో కూడా వారి కెమిస్ట్రీని అభిమానులు బాగా ఇష్టపడ్డారు.

అయితే 2018లో, ఆ తర్వాత 2022లో కూడా విజయ్, అతని కుటుంబం ఒక బ్రెజిలియన్ మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఆమెనే అతని గర్ల్‌ఫ్రెండ్ అని చాలా మంది భావించారు.

కానీ 2023లో మాల్దీవుల్లో విజయ్, రష్మిక ఇద్దరూ కలిసి వెకేషన్‌లో ఉన్నారని, వారు పోస్ట్ చేసిన ఫొటోల ద్వారా గమనించిన అభిమానులు వారు రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే వదంతులకు మరింత బలం చేకూర్చారు. ఈ జంట వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకోనుంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం