VD 12 Poster Copy: విజయ్ దేవరకొండ మూవీ కొత్త పోస్టర్ కాపీనా? - క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్
VD 12 Poster Copy: విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ స్పైయాక్షన్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. విజయ్ బర్త్ డే సందర్భంగా మంగళవారం రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ హాలీవుడ్ మూవీ నుంచి కాపీ కొట్టారంటూ జరుగుతోన్న ప్రచారంపై ప్రొడ్యూసర్ క్లారిటీ ఇచ్చాడు.
VD 12 Poster Copy: విజయ్ దేవరకొండ హీరోగా జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి దర్శకుడు త్రివిక్రమ్ ఈ మూవీని నిర్మిస్తోన్నారు. విజయ్ దేవరకొండ బర్త్‌డే సందర్భంగా మంగళవారం ఈ సినిమా కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ట్రెండింగ్ వార్తలు
కట్ చేసి ఉన్న పొడవైన పేపర్స్‌పై విజయ్ దేవరకొండ ముఖం సగం మాత్రమే కనిపించేలా డిజైన్ చేసిన ఈ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ కొత్త పోస్టర్ హాలీవుడ్ స్పై యాక్షన్ మూవీ ఆర్గోను పోలి ఉండటం ఆసక్తికరంగా మారింది. హాలీవుడ్ మూవీ పోస్టర్‌ను కాపీ కొట్ట విజయ్ దేవరకొండ మూవీ పోస్టర్‌ను డిజైన్ చేశారంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు.
రెండు పోస్టర్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ కాపీ కామెంట్స్‌పై ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. పోస్టర్ విషయంలో ఏ సినిమా నుంచి స్ఫూర్తి పొందలేదని, ఎవరినీ కాపీ కొట్టలేదని నాగవంశీ అన్నారు.ఈ రెండు పోస్టర్స్ ఒకేలా కనిపించడం కాకతాళీయమంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. నిర్మాత ట్వీట్ వైరల్‌గా మారింది.
కాగా స్పై యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ మూవీ పూజా కార్యక్రమాలను ఇటీవలే నిర్వహించారు. ఇందులో విజయ్ దేవరకొండకు జోడీగా శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో విజయ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
నాని జెర్సీ తర్వాత తెలుగులో గౌతమ్ తిన్ననూరి చేస్తోన్న సినిమా ఇదే కావడం గమనార్హం. విజయ్ దేవరకొండ మూవీ స్థానంలో రామ్ చరణ్‌తో స్పోర్ట్స్ డ్రామా సినిమా చేయాల్సింది డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. కానీ సరైన కథ కుదరకపోవడంతో ఆ మూవీ కార్యరూపం దాల్చలేదు.