Vijay 2023 New Year Photo: ఫొటోలు వేరు బ్యాక్‌గ్రౌండ్.. విజయ్-రష్మిక లవ్ కన్ఫార్మ్ చేసిన నెటిజన్లు..!
Vijay 2023 New Year Photo: విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా ప్రేమలో ఉన్నారని వస్తున్న వార్తలపై వీరిద్దరూ కొట్టిపారేశారు. అయితే వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని నిరూపిస్తున్నారు నెటిజన్లు. విజయ్ షేర్ చేసిన న్యూ ఇయర్ ఫొటోతో రష్మిక పాత ఫొటోనూ పోలుస్తూ తమ స్పందనలు తెలుపుతున్నారు.
Vijay 2023 New Year Photo: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఏం పోస్ట్ చేసినా అది క్షణాల్లో వైరల్ అవుతోంది. రష్మికా మందన్నాతో ప్రేమాయణం కొనసాగిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చినప్పటికీ.. వీరిద్దరూ వాటిని కొట్టి పడేశారు. అయితే గత అక్టోబరులో వీరిద్దరూ మాల్దీవులకు వెళ్లారు. అంతేకాకుండా అక్కడ షేర్ చేసిన ఫొటోలు కూడా బయటకొచ్చాయి. దీంతో నేషనల్ క్రష్‌తో విజయ్ ప్రేమలో మునిగి తేలుతున్నాడని పలు కథనాలు వచ్చాయి. తాజాగా విజయ్ పెట్టిన ఓ ఫొటోను చూపిస్తూ రష్మికతో అతడు ప్రేమలో ఉన్నట్లు మరోసారి నిరూపించేశారు నెటిజన్లు.
"రౌడీ హీరో 2022కి గుడ్‌బాయ్ చెబుతూ.. ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఈ సంవత్సరం మనను ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. ఆనందకరమైన క్షణాలను గడిపాం, నిశ్శబ్ధంగా ఏడ్చాం, లక్ష్యాల కోసం ప్రయత్నించాం. కొన్నింటిని గెలిచాం, కొన్నింటిలో ఓడాం. మనం ప్రతీది సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే అదే జీవితం. నా ప్రియాతి ప్రియమైన అభిమానులకు హ్యాపీ న్యూయ ఇయర్. ఈ ఏడాది మీకు గొప్పగా ఉండాలని కోరుకుటున్నా" అంటూ విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టాడు.
ఈ పోస్టుకు ఓ రిసార్ట్‌లో నీళ్లలోకి దిగి సేదతీరుతున్న ఫొటోను కూడా విజయ్ షేర్ చేశాడు. అయితే రౌడీ హీరో దిగిన ఈ ఫొటో.. అతడు రష్మికతో ప్రేమలో ఉన్నట్లు తేల్చేసింది. ఎందుకంటే సరిగ్గా అదే రిసార్ట్‌లో అదే బ్యాక్ గ్రౌండ్‌లో రష్మిక ఓ ఫొటో దిగి అక్టోబరు 9న ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. ఇప్పుడీ రెండు ఫొటోలను పక్కన పెట్టి చూస్తుంటే ఇద్దరూ కలిసే అక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో నెటిజన్లు విజయ్ పోస్టుపై విపరీతంగా స్పందిస్తున్నారు. ఇద్దరూ స్నేహితులే అయినప్పుడు ఇలా సీక్రెట్‌గా కలుసుకోవడం దేనికి అంటూ ప్రశ్నిస్తున్నారు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి సారించాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో సమంత హీరోయిన్‌గా చేస్తోంది. ఇప్పటికే రెండు షెడ్యూళ్ల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. సామ్ అనారోగ్యం భారిన పడటంతో తాత్కాలికంగా నిలిచిపోయింది. మరోపక్క రష్మిక కూడా అల్లు అర్జున్ సరసన పుష్ప-2 చేస్తోంది. ఈ సినిమా కాకుండా బాలీవుడ్‌లో రెండు, మూడు ప్రాజెక్టులకు ఓకే చెప్పింది.
సంబంధిత కథనం