Family Star OTT: భారీ ధరకు ఫ్యామిలీ స్టార్ ఓటీటీ రైట్స్.. దిల్ రాజుకు అంత వాటా! ఏ ఓటీటీ అంటే?-vijay devarakonda family star movie ott rights to amazon prime ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Vijay Devarakonda Family Star Movie Ott Rights To Amazon Prime

Family Star OTT: భారీ ధరకు ఫ్యామిలీ స్టార్ ఓటీటీ రైట్స్.. దిల్ రాజుకు అంత వాటా! ఏ ఓటీటీ అంటే?

Sanjiv Kumar HT Telugu
Mar 19, 2024 10:55 AM IST

Family Star OTT Deal: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బ్యూటిఫుల్ మృణాల్ ఠాకూర్ తొలిసారి జంటగా నటిస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. డైరెక్టర్ పరుశురామ్ తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ స్టార్ ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్లు సమచారం. దాంతో నిర్మాత దిల్ రాజు ఇక సేఫ్ అయినట్లే అని టాక్ నడుస్తోంది.

భారీ ధరకు ఫ్యామిలీ స్టార్ ఓటీటీ రైట్స్.. దిల్ రాజుకు అంత వాటా! ఏ ఓటీటీ అంటే?
భారీ ధరకు ఫ్యామిలీ స్టార్ ఓటీటీ రైట్స్.. దిల్ రాజుకు అంత వాటా! ఏ ఓటీటీ అంటే?

Vijay Devarakonda Family Star OTT: రౌడీ హీరోగా తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. లైగర్ సినిమాతో భారీ డిజాస్టర్ చవిచూసిన విజయ్ దేవరకొండ అనంతరం సమంతతో కలిసి నటించిన ఖుషీ మూవీ యావరేజ్‌గా నిలిచింది. ఇప్పుడు ఎలాగైనా భారీ బ్లాక్ బస్టర్ కొట్టాలన్న ఆశతో ప్రేక్షకుల ముందుకు ఫ్యామిలీ స్టార్‌గా రానున్నాడు విజయ్ దేవరకొండ. ఇందులో విజయ్‌కు జోడీగా సీతారామం బ్యూటి మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా చేస్తోంది.

విజయ్ దేవరకొండ-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) తొలిసారి కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఫ్యామిలీ స్టార్‌పై మంచి బజ్ క్రియేట్ అవుతోంది. అలాగే ఈ సినిమాకు డైరెక్టర్ పరుశరామ్ దర్శకత్వం వహించడంతో మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. పరుశురామ్-విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వచ్చిన గీతా గోవిందం సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో తెలిసిందే. అందుకే ఈ కాంబో మూవీ ఫ్యామిలీ స్టార్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆ అంచనాలకు తగినట్లుగానే ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్ ఉన్నాయి. ఫ్యామిలీ స్టార్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ సైతం వచ్చింది. ఇక ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ కానుంది.

ఈ నేపథ్యంలో ఫ్యామిలీ స్టార్ ఓటీటీ డీల్ ఆసక్తికరంగా మారింది. కోట్ల రూపాయల పెట్టుబడి వెనక్కి తిరిగి సినిమా ప్రొడ్యూసర్‌ చేతికి వచ్చే ఓటీటీ రైట్స్ వాటా ఎప్పుడూ కీలకంగా ఉంటుంది. అలా ఫ్యామిలీ స్టార్ విషయంలో నిర్మాత దిల్ రాజుకు ఆ వాటా వచ్చేసినట్లు, ఈ విషయంలో ఆయన సేఫ్ అని టాక్ నడుస్తోంది. ఫ్యామిలీ స్టార్ మూవీ ఓటీటీ రైట్స్ డీల్ క్లోజ్ అయినట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఫ్యామిలీ స్టార్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుందని తెలుస్తోంది.

విజయ్ దేవరకొండ-పరుశు రామ్-మృణాల్ ఠాకూర్ వంటి క్రేజీ కాంబినేషన్ సినిమా ఫ్యామిలీ స్టార్ కావడంతో మంచి ధరకు ఓటీటీ రైట్స్ అమ్ముడు పోయినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలను ఇవాళ అంటే మార్చి 19న అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఫ్యామిలీ స్టార్ ఓటీటీ డీల్ క్లోజ్ కావడంతో థియేట్రికల్ బిజనెస్‌పై నిర్మాతలు ఫోకస్ చేశారట. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో 54వ చిత్రంగా ఫ్యామిలీ స్టార్ రూపొందడం విశేషం.

దిల్ రాజుకు పర్మనెంట్ డిస్ట్రిబ్యూటర్స్ ఉండగా.. కొన్ని ఏరియాల్లో సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారని తెలిసిందే. మిగతా ఏరియాలను రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్స్‌కు ఇస్తారు. ఫ్యామిలీ స్టార్ సినిమాకు థియేట్రికల్ బిజినెస్ ద్వారా దాదాపుగా రూ. 50 కోట్లు రావాలని దిల్ రాజు ఆలోచిస్తున్నారని టాక్ నడుస్తోంది.

WhatsApp channel