విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు డబుల్ సర్‌ప్రైజ్- బర్త్ డే విషెస్‌తో 2 కొత్త పోస్టర్స్- యదార్థ చారిత్రక సంఘటనలతో ఒక మూవీ!-vijay devarakonda birthday special svc59 and vd14 movie posters released rashmika mandanna heroine ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు డబుల్ సర్‌ప్రైజ్- బర్త్ డే విషెస్‌తో 2 కొత్త పోస్టర్స్- యదార్థ చారిత్రక సంఘటనలతో ఒక మూవీ!

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు డబుల్ సర్‌ప్రైజ్- బర్త్ డే విషెస్‌తో 2 కొత్త పోస్టర్స్- యదార్థ చారిత్రక సంఘటనలతో ఒక మూవీ!

Sanjiv Kumar HT Telugu

విజయ్ దేవరకొండ అభిమానులకు డబుల్ సర్‌ప్రైజ్ అందించారు రౌడీ హీరోతో చేస్తున్న రెండు సినిమాల మేకర్స్. మే 9న విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా ఎస్‌వీసీ 59, వీడీ 14 సినిమాల కొత్త పోస్టర్స్‌ను రిలీజ్ చేశారు. ఇవి ఫుల్ ఇంటెన్సివ్‌గా అదిరిపోయాయి. వీటిలో ఓ మూవీని బ్రిటీష్ పాలన కాలం నాటి కథతో రూపొందిస్తున్నారు.

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు డబుల్ సర్‌ప్రైజ్- బర్త్ డే విషెస్‌తో 2 కొత్త పోస్టర్స్- యదార్థ చారిత్రక సంఘటనలతో ఒక మూవీ!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రెండు, మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఇక మే 9న విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమాల మేకర్స్ రౌడీ హీరో అభిమానులకు డబుల్ సర్‌ప్రైజ్ అందించారు.

దిల్ రాజు-అల్లు శిరీష్ మూవీ

రెండు సినిమాలకు సంబంధించిన కొత్త పోస్టర్స్‌ను మే 9న రిలీజ్ చేశారు. వాటిలో ఒకటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో వస్తోన్న ఎస్‌వీసీ 59 సినిమా. ఈ చిత్రాన్ని సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. 'రాజా వారు రాణి గారు' సినిమాతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా

శుక్రవారం (మే 9) హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ "ఎస్‌వీసీ 59" మూవీ నుంచి పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ఇంటెన్స్‌గా ఉండి ఆకట్టుకుంటోంది. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ సినిమా రూపొందనుంది. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు.

శ్యామ్ సింగరాయ్ డైరెక్టర్

ఇక విజయ్ దేవరకొండ చేస్తున్న మరో సినిమా వీడీ 14. టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ సినిమాల డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుననారు. ప్రెస్టీజియస్ బ్యానర్స్ మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ కాంబోలో ఈ సినిమా రూపొందుతోంది. వీడీ 14 సినిమా బ్రిటీష్ కాలం నేపథ్యంతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది.

రష్మిక మందన్న హీరోయిన్

విజయ్ దేవరకొండ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక మే 9న విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్‌తో శుభాకాంక్షలు తెలియజేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో ధ్యానముద్రలో ఉన్న విజయ్ దేవరకొండ స్టిల్ ఆసక్తి కలిగిస్తోంది.

బ్రిటీష్ పాలన కాలం నేపథ్యంగా

బ్రిటీష్ పాలన కాలం నేపథ్యంగా వచ్చిన చిత్రాల్లో ఇప్పటిదాకా ఎవరూ తెరకెక్కించని కథాంశంతో "వీడీ 14" ఒక పవర్ ఫుల్ మూవీగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకాన్ని మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ సినిమా రూపొందుతోంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం