vijay deverakonda: ఇండియా పాకిస్థాన్ మ్యాచ్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా విజయ్ దేవరకొండ
ఆదివారం దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ కు టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. వసీమ్ అక్రమ్, ఇర్ఫాన్ పఠాన్ లతో సరదాగా తన క్రికెట్ అనుభవాలను విజయ్ పంచుకున్నాడు.
దుబాయ్ వేదికగా నేడు జరుగుతున్న ఇండియా పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌కు టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇర్ఫాన్ పఠాన్, వసీమ్ అక్రమ్‌లతో కలిసి స్టేడియంలో తన క్రికెట్ అనుభవాలను గురించి అభిమానులతో పంచుకున్నాడు విజయ్ దేవరకొండ.
టీమ్ ఇండియా క్రికెటర్లతో కలిసి స్టేడియంలో ఉండే అవకాశం దక్కడం ఆనందంగా ఉందని తెలిపింది. స్టేడియంలో నిల్చొని అభిమానులను, క్రికెటర్లను చూస్తుండటం గొప్ప అనుభూతిని కలిగించిందని తెలిపాడు. వసీస్ అక్రమ్ ను ఆరాధిస్తూ పెరిగానని, ఆ తర్వాత కాలంలో టీమ్ ఇండియా పాలిట విలన్ గా మారడంతో అతడిని ద్వేషించడం ప్రారంభించానని విజయ్ అన్నాడు. ఇండియాతో మ్యాచ్ లు ఆడుతున్నప్పుడు వసీమ్ బౌలింగ్ స్పెల్ ఎప్పుడూ ముగుస్తుందా అని ఎదురుచూస్తుండేవాడినని అన్నాడు.
పది ఓవర్ల లోపే అతడి కోటా పూర్తవుతుందని అనుకుంటే ఇరవై ఓవర్లు అయినా ముగిసేది కాదని అన్నాడు. వసీమ్ రిటైర్ కోసం ఎదురుచూసేవాళ్లమని అన్నారు. వసీమ్ బౌలింగ్ భారీ షాట్స్ కొట్టాలనే కోరిక ఉండేదంటూ సరదాగా విజయ్ ముచ్చటించాడు. వసీమ్ అక్రమ్, విజయ్ దేవరకొండ మధ్య సాగిన ఈ సరదా సంభాషణ క్రికెట్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు.