తమిళంలో మర్డర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్ వంటి జోనర్ సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు హీరో విజయ్ ఆంటోనీ. బిచ్చగాడు మూవీతో కోలీవుడ్‌లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి పాపులారిటీ సాధించాడు. బిచ్చగాడు 2 సినిమాతో మరో సక్సెస్ అందుకుని పలు రొమాంటిక్ మూవీస్‌తో కూడా విజయ్ ఆంటోనీ మెప్పించాడు.
ఇప్పుడు మరో మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీతో అలరించడానికి విజయ్ ఆంటోనీ రెడీగా ఉన్నాడు. విజయ్ ఆంటోనీ నటించిన లేటెస్ట్ మూవీ ‘మార్గన్’. లియో జాన్ పాల్ కథ, దర్శకత్వం వహించిన ఈ సినిమాకు విజయ్ ఆంటోనీ ఫిలింస్ కార్పొరేషన్ నిర్మిస్తుండగా, హీరో భార్య మీరా విజయ్ ఆంటోని సగర్వంగా సమర్పిస్తున్నారు.
మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్‌గా రానున్న ఈ మార్గన్ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన విజయ్ ఆంటోనీ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా ఈ సినిమా ద్వారా హీరో విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ ధీషన్‌ను విలన్‌గా పరిచయం చేస్తుండటం విశేషం.
దీనికి సంబంధించిన రిలీజ్ చేసిన యాక్షన్-ప్యాక్డ్ పోస్టర్‌ను చూస్తుంటే విజయ్ ఆంటోనీ, అజయ్ మధ్య భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండేలా కనిపిస్తోంది. ఈ రెండు పాత్రలు తలపడే సీన్లు ప్రేక్షకులకు ఆడ్రినలిన్ రష్ ఇచ్చేలా ఉంది.
ఇక మార్గన్ సినిమాలో సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖ, కలక్క పోవదు యారు అర్చన, కనిమొళి, అంతగారం నటరాజన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా, ఇప్పటికే మేజర్ పార్ట్ పనులు పూర్తి చేసుకున్న ఈ మార్గన్ మూవీని జూన్ 27న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు.
ఈ మేరకు వదిలిన కొత్త పోస్టర్ మార్గన్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచేస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే హృద్యమైన కుటుంబ చిత్రంగా రానున్న ఈ చిత్రానికి యువ.ఎస్ సినిమాటోగ్రఫర్‌గా వర్క్ చేశారు. పాన్ ఇండియాగా రిలీజ్ కానున్న మార్గన్ సినిమాలో హీరోగా చేసిన విజయ్ ఆంటోనీ స్వయంగా సంగీతం సమకూర్చారు.
ఇక రాజా.ఎ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. మరి ఇప్పటివరకు విభిన్న కాన్సెప్ట్స్‌తో తమిళ, తెలుగు ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న విజయ్ అంటోనీ మార్గన్‌తో ఎలాంటి థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వనున్నారో ఆసక్తిగా మారింది. ఇకపోతే ముందుగా సంగీత దర్శకుడుగా పనిచేసిన విజయ్ ఆంటోనీ హీరోగా మారిన విషయం తెలిసిందే.
సంబంధిత కథనం