Nayanthara: నయనతార బర్త్ డేకు కాస్ట్‌లీ బెంజ్ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన విఘ్నేష్ శివన్ - ధర ఎంతంటే?
Nayanthara: నయనతార బర్త్‌డేకు ఆమె భర్త, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ కాస్ట్‌లీ మెర్సిడెజ్ బెంజ్ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ కారు ఖరీదు దాదాపు మూడు కోట్ల నలభై లక్షల వరకు ఉంటుందని సమాచారం.
Nayanthara: నయనతార బర్త్‌డేకు విఘ్నేష్ శివన్ కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చాడు. ఇటీవలే నయనతార తన 39వ బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్నది. భర్త విఘ్నేష్ శివన్‌తో పాటు కవల తనయులు ఉయిర్, ఉలగ్‌లతో కలిసి పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
భార్య నయనతార బర్త్ డేకు విఘ్నేష్ శివన్ ఖరీదైన మెర్సిడెజ్ బెంజ్ మేబ్యాక్ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ కారు ధర దాదాపు మూడు కోట్ల నలభై లక్షల వరకు ఉంటుందని సమాచారం. విఘ్నేష్ శివన్ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నయనతార వెల్లడించింది.
తన బర్త్‌డేకు భర్త విఘ్నేష్ శివన్ ఇచ్చిన స్వీటెస్ట్ గిఫ్ట్ ఇదని తెలిపింది. తన కారుకు సంబంధించిన బెర్సిడెజ్ బెంజ్ సింబల్ ఫొటోను పోస్ట్ చేస్తూ వెల్ కమ్ హోమ్ యూ బ్యూటీ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. నయనతార పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఏడాది జవాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది నయనతార.షారుఖ్‌ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా 1100 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. నయనతార హీరోయిన్‌గా నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ అన్నపూర్ణి డిసెంబర్ 1న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాకు నీలేష్ కృష్ణ దర్శకత్వం వహిస్తోన్నాడు.
టాపిక్