Ranveer Singh: రణ్‌వీర్‌ సింగ్‌కు బట్టలు దానం చేస్తున్న ఇండోర్‌ వాసులు.. వీడియో-video of indore people donating clothes to ranveer singh going viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ranveer Singh: రణ్‌వీర్‌ సింగ్‌కు బట్టలు దానం చేస్తున్న ఇండోర్‌ వాసులు.. వీడియో

Ranveer Singh: రణ్‌వీర్‌ సింగ్‌కు బట్టలు దానం చేస్తున్న ఇండోర్‌ వాసులు.. వీడియో

HT Telugu Desk HT Telugu

Ranveer Singh: న్యూడ్‌ ఫొటోషూట్‌ చేసిన బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌తో ఆడుకుంటున్నారు. కొందరు ఇప్పటికే అతనిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. ఇప్పుడు మరికొందరు అతనికి బట్టలు దానం చేస్తున్నారు.

న్యూడ్ ఫొటో షూట్ లో రణ్‌వీర్‌ సింగ్‌

ఇండోర్‌: బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాడు. పేపర్‌ మ్యాగజైన్ కోసం అతడు చేసిన న్యూడ్‌ ఫొటోషూట్‌పై మిశ్రమ స్పందన వస్తోంది. అయితే చాలా వరకూ దీనిపై నెగటివ్‌గా స్పందించిన వాళ్లే ఉన్నారు. చెంబూర్‌ పోలీసులు ఏకంగా అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయగా.. ఇప్పుడు ఇండోర్‌ వాసులు అతనికి బట్టలు దానం చేస్తున్నారు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఇండోర్‌లోని ఓ వీధిలో రణ్‌వీర్‌ నగ్నంగా ఉన్న ఫొటోను ఉంచి, దాని ముందు ఓ బాక్స్‌ పెట్టారు. అక్కడి వాళ్లంతా అందులో తమ దగ్గర ఉన్న పాత బట్టలు వేస్తున్నారు. ఈ వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేయగానే చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ఎంతో మంది ఈ వీడియోను షేర్‌ చేస్తున్నారు.

ఇండోర్‌ను ఎంతో స్వచ్ఛంగా ఉంచుతున్నట్లే ఈ దేశంలో మానసిక చెత్తను కూడా తొలగించాలని రణ్‌వీర్‌ న్యూడ్‌ ఫొటోపై రాయడం విశేషం. రణ్‌వీర్‌ న్యూడ్‌ ఫొటోలపై అతని భార్య దీపికా కూడా పాజిటివ్‌గా స్పందించినా.. చాలా మంది మాత్రం అతనిపై మండిపడుతున్నారు. మహిళల మనోభావాలను దెబ్బతీశాడంటూ కొందరు అతనిపై ముంబై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

సంబంధిత కథనం