Vidamuyarchi Review: అజిత్ లేటెస్ట్ తమిళ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉంది? త్రిషకు హిట్టు దక్కిందా?
Vidamuyarchi Review:అజిత్, త్రిష జంటగా నటించిన విదాముయార్చి మూవీ గురువారం థియేటర్లలో రిలీజైంది. తెలుగులో పట్టుదల పేరుతో విడుదలైన ఈ మూవీ ఎలా ఉందంటే?

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కొంత గ్యాప్ తర్వాత విదాముయార్చి మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెలుగులో పట్టుదల పేరుతో రిలీజైంది. త్రిష హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో అర్జున్, రెజీనా కీలక పాత్రలు పోషించారు. మగీజ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. గురువారం విడుదలైన విదాముయాచ్చి మూవీ ఎలా ఉందంటే?
అర్జున్ భార్య మిస్సింగ్...
అర్జున్ (అజిత్) కయల్(త్రిష) ప్రేమించి పెళ్లిచేసుకుంటారు. పన్నెండేళ్ల తర్వాత భర్త నుంచి విడిపోవాలని కయల్ నిర్ణయించుకుంటుంది. కయల్‌కు విడాకులు ఇవ్వడం అర్జున్‌కు ఇష్టం ఉండదు. కానీ భార్య నిర్ణయాన్ని కాదనలేక అంగీకరిస్తాడు. కయల్‌తో కలిసి చివరగా ఓ ట్రిప్ ప్లాన్ చేస్తాడు. అనుకోకుండా వారి కారు ఆగిపోతుంది.
ఓ అపరిచిత జంట వచ్చి సాయం పేరుతో కయల్‌తో పాటు పాటు తీసుకెళతారు.ఆ తర్వాత కయల్ కనిపించకుండా పోతుంది?అర్జున్‌కు విడాకులు ఇవ్వాలని కయల్ ఎందుకు అనుకున్నది? ఆమెను కనిపించకుండా పోవడానికి కారణం ఏమిటి? ఈ మిస్సింగ్ మిస్టరీని అర్జున్ ఎలాసాల్వ్ చేశాడు? అర్జున్‌పై పగను పెంచుకున్న రక్షిత్ అలియాస్ ధీరజ్ (అర్జున్) ఎవరు? రక్షిత్ భార్య దీపిక (రెజీనా) కథ ఏమిటి? అన్నదే విదా ముయార్చి కథ.
అజిత్ సినిమా అంటేనే...
అజిత్ సినిమా అంటేనే భారీ ఫైట్లు, స్టైలిష్ ఛేజింగ్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌కు డోకా ఉండదని అభిమానులు భావిస్తుంటారు. అజిత్‌ను ఎలాగైతే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటారో ఆ ఎలిమెంట్స్‌తోనే రూపొందిన పక్కా కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది.
స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్...
విదాముయార్చి కథ కోసం దర్శకుడు ఎక్కువగా కష్టపడలేదు. ఓ తన భార్య మిస్సింగ్ వెనకున్న మిస్టరీని ఛేదించే ఓ భర్త కథ ఇది. ఈ సింపుల్ పాయింట్‌తోనే స్క్రీన్‌ప్లేతో కొత్తగా చెప్పేందుకు ప్రయత్నించాడు దర్శకుడు. ఇలా కూడా రాసుకోవచ్చా అని ఆడియెన్స్ ఎగ్జైటింగ్‌గా ఫీలయ్యేలా చేసే సీన్స్ ఈ మూవీలో చూలానే కనిపిస్తాయి.
మైండ్‌గేమ్...
అర్జున్, కయల్ రిలేషన్‌తోనే రొమాంటిక్‌గా విదాముయార్చి మూవీ మొదలవుతుంది. వారి మధ్య పరిచయం, ప్రేమ, పెళ్లి రెగ్యులర్ లవ్ స్టోరీస్‌కు భిన్నంగా చూపించాడు. కయల్ మిస్సింగ్ నుంచే అసలు కథ మొదలవుతుంది. అక్కడి నుంచి ఒక్కో కొత్త క్యారెక్టర్ తెరపైకి తీసుకొస్తూ నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీని ఆడియెన్స్‌లో కలిగించాడు.
అజిత్, అర్జున్ మధ్య పోరాటం కంప్లీంట్‌గా మైండ్‌గేమ్‌తో నడిపించాడు. ఎవరిపై మరొకరు తెలివిగా వేసే ఎత్తులు, అర్జున్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సెకండాఫ్‌లో హైలైట్‌గా నిలిచాయి. సినిమా స్లో అవుతుందని ఆడియెన్స్ ఫీలయ్యే టైమ్‌లోనే ఒక్కో ట్విస్ట్ రివీల్ చేస్తూ చివరి వరకు ఉత్కంఠభరితంగా ఈ మూవీని నడిపించాడు.
రేసీ స్క్రీన్‌ప్లే...
సాధారణంగా ఇలాంటి యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు రేసీ స్క్రీన్‌ప్లేతో నడిపించడం ముఖ్యం. కథలోని లోపాలను వెతుక్కునే టైమ్ కూడా ఆడియెన్స్ ఇవ్వకుండా ఫాస్ట్ ఫేజ్‌తో సాగాలి. అలాంటి స్పీడు ఈ సినిమాలో మిస్సయ్యింది. చాలా వరకు ట్విస్ట్‌లు ప్రెడిక్టబుల్‌గానే ఉన్నాయి. పాయింట్ కొత్తదే కానీ దానిని నడిపించిన తీరు రొటీన్‌గా అనిపిస్తుంది.
అజిత్ వేరియేషన్స్...
గత సినిమాలతో పోలిస్తే యాక్టింగ్‌లో వేరియేషన్స్ చూపించేందుకు విదాముయార్చిలో అజిత్‌కు అవకాశం దొరికింది. యాక్షన్ కంటే ఎమోషన్స్‌కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ అజిత్ పాత్రను మలిచిన విధానం బాగుంది. భార్య దూరమై పడే బాధ, ఆమె ప్రేమ కోసం పరితపించే సీన్స్‌లో మెప్పించాడు. యాక్షన్ సన్నివేశాల్లో చెలరేగిపోయాడు.
త్రిష రొమాంటిక్ సీన్స్‌తో ఆకట్టుకుంది. అజిత్‌కు ధీటుగా అర్జున్ పాత్ర సాగింది. తన అనుభవంతో పాత్రకు ప్రాణం పోశాడు. కీలక పాత్రకు రెజీనా న్యాయం చేసింది. అనిరుధ్ పాటలు మోస్తారుగానే ఉన్నా బీజీఎమ్ మాత్రం సినిమా ప్లస్ పాయింట్‌గా నిలిచింది. అజర్‌బైజాన్ ఎడారిలో తీసిన సీన్స్ కొత్తగా ఉన్నాయి.
అజిత్ ఫ్యాన్స్ కోసమే…
విదాముయార్చి అజిత్ అభిమానులను మెప్పించే యాక్షన్ థ్రిల్లర్ మూవీ. కథ, కథనాల విషయంలో కొత్తదనం లేకపోయినా యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం ఆకట్టుకుంటాయి.
నోట్: మూవీ తమిళ వెర్షన్ ఆధారంగా రాసిన రివ్యూ అని గమనించగలరు.
టాపిక్