Vidaamuyarchi trailer: అదిరిపోయే యాక్షన్‌తో వచ్చేసిన అజిత్ విదాముయర్చి ట్రైలర్.. రిలీజ్ డేట్ ఇదే
Vidaamuyarchi trailer: తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన విదాముయర్చి ట్రైలర్ వచ్చేసింది. అదిరిపోయే యాక్షన్ సీన్లతో ఈ ట్రైలర్ మూవీపై అంచనాలను పెంచేసింది. ఈ ట్రైలర్ తోపాటు మేకర్స్ మూవీ రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు.
Vidaamuyarchi trailer: అజిత్ కుమార్ విదాముయర్చి ట్రైలర్ గురువారం (జనవరి 16) రిలీజైంది. ఈ యాక్షన్ డ్రామా.. ప్రేక్షకులను థియేటర్లలో సీట్ల అంచున కూర్చొనేలా ఉండబోతోందని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. ఇక ఈ మూవీ ఫిబ్రవరి 6న థియేటర్లలో రిలీజ్ కానున్నట్లు కూడా మేకర్స్ వెల్లడించారు. ఈ మూవీలో అజిత్ సరసన త్రిష కృష్ణన్ నటించింది.

విదాముయర్చి ట్రైలర్
ఈ సంక్రాంతికే వస్తుందని భావించిన విదాముయర్చి మూవీ వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయడం ద్వారా మూవీ కొత్త రిలీజ్ డేట్ ను కూడా మేకర్స్ తెలిపారు. గురువారం (జనవరి 16) ఈ మూవీ ట్రైలర్ వచ్చింది. ఈ ట్రైలర్ ఓ అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ తో మొదలవుతుంది. ఆ తర్వాత అజిత్, త్రిష మధ్య కెమెస్ట్రీని చూపించే సీన్లు వస్తాయి.
కొత్త జీవితం కోసం అంటూ అజిత్ పాత్ర అజర్‌బైజాన్ వెళ్తుంది. అయితే అక్కడ అతనికి కొత్త సమస్య ఎదురవుతుంది. ఆ తర్వాత కూడా ట్రైలర్ హైయాక్షన్ సీక్వెన్స్ తో సాగుతుంది. ఈ ట్రైలర్లో అజిత్ యంగ్ లుక్ కూడా ప్రత్యేకంగా నిలిచింది.
అర్జున్ సర్జా హైలైట్
ఈ విదాముయర్చి ట్రైలర్ లో అర్జున్ సర్జా హైలైట్ గా నిలిచాడు. మూవీలో విలన్ గా నటిస్తున్న అతని లుక్ అదిరిపోయేలా ఉంది. అజిత్, అర్జున్ మధ్య యాక్షన్ సీన్లు మూవీలో ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో ఈ ట్రైలర్ కళ్లకు కట్టింది. టైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాను మగిళ్ తిరుమణి డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో అజిత్, అర్జున్, త్రిషతోపాటు రెజీనా కాసాండ్రా, ఆరవ్, రమ్య సుబ్రమణియన్ కూడా నటించారు.
ఈ ఏడాది రాబోతున్న మోస్ట్ అవేటెడ్ మూవీస్ లో ఈ విదాముయర్చి కూడా ఒకటి. 1997లో వచ్చిన బ్రేక్‌డౌన్ మూవీకి ఇది రీమేక్ గా భావిస్తున్నారు. అనిరుధ్ అందించిన మ్యూజిక్ కూడా ట్రైలర్ లో హైలైట్ గా నిలిచింది. ఈ సినిమా ఫిబ్రవరి 6న థియేటర్లలో రిలీజ్ కానుంది.