Venkatesh Brother: విక్ట‌రీ వెంక‌టేష్ త‌మ్ముడు కోలీవుడ్‌లో ఫేమ‌స్ యాక్ట‌ర్ -హీరోగా అత‌డు చేసిన త‌మిళ‌, తెలుగు మూవీస్ ఇవే-victory venkatesh brother daggubati raja telugu and tamil movies hits flops ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Venkatesh Brother: విక్ట‌రీ వెంక‌టేష్ త‌మ్ముడు కోలీవుడ్‌లో ఫేమ‌స్ యాక్ట‌ర్ -హీరోగా అత‌డు చేసిన త‌మిళ‌, తెలుగు మూవీస్ ఇవే

Venkatesh Brother: విక్ట‌రీ వెంక‌టేష్ త‌మ్ముడు కోలీవుడ్‌లో ఫేమ‌స్ యాక్ట‌ర్ -హీరోగా అత‌డు చేసిన త‌మిళ‌, తెలుగు మూవీస్ ఇవే

Nelki Naresh Kumar HT Telugu
Feb 01, 2025 04:50 PM IST

Venkatesh Brother: విక్ట‌రీ వెంక‌టేష్ త‌మ్ముడు ద‌గ్గుబాటి రాజా త‌మిళంలో ఫేమ‌స్ యాక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు. హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా అర‌వైకిపైగా సినిమాలు చేశాడు. తెలుగులోనూ ఇర‌వై సినిమాల్లో న‌టించాడు. ద‌గ్గుబాటి రాజా చేసిన సినిమాలు ఏవంటే?

ద‌గ్గుబాటి రాజా
ద‌గ్గుబాటి రాజా

Venkatesh Brother: ద‌గ్గుబాటి ఫ్యామిలీ నుంచి వెంక‌టేష్‌తో పాటు రానా ద‌గ్గుబాటి, అత‌డి సోద‌రుడు అభిరామ్ యాక్ట‌ర్లుగా మారారు. హీరోగా టాలీవుడ్‌లో ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్స్ అందుకున్నాడు వెంక‌టేష్‌. టాప్ హీరోల్లో ఒక‌రిగా పేరు తెచ్చుకున్నాడు. రానా కూడా వెర్స‌టైల్ యాక్ట‌ర్‌గా నిరూపించుకున్నాడు. ద‌గ్గుబాటి ఫ్యామిలీకి చెందిన ఓ యాక్ట‌ర్ తెలుగులో కాకుండా త‌మిళంలో హీరోగా ఫేమ‌స్ అయ్యాడు. అత‌డు మ‌రెవ‌రో కాదు ద‌గ్గుబాటి రాజా.

yearly horoscope entry point

రామానాయుడు అన్న కొడుకు...

నిర్మాత రామానాయుడు అన్న కొడుకు అయిన రాజా త‌మిళంలో అర‌వైకిపైగా సినిమాలు చేశాడు. అందులో హీరోగా 30 వ‌ర‌కు సినిమాలు ఉన్నాయి. భార‌తీరాజా, మ‌ణిర‌త్నం వంటి అగ్ర ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేశాడు. విజ‌య్ కాంత్‌, ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్ హీరోలుగా న‌టించిన ప‌లు సూప‌ర్ హిట్ సినిమాల్లో కీల‌క పాత్ర‌లు చేశాడు.

క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీతో...

1981లో క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన చిన్న ముళ్ పెరియ ముళ్ మూవీతో హీరోగా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు ద‌గ్గుబాటి రాజా. కోలీవుడ్‌లో ల‌వ‌ర్‌బాయ్‌గా పేరు తెచ్చుకున్న అత‌డు ఇథు ఎంగ‌ల్ నీతి, క‌ర్పూర ముల్లై, మూండ్ర‌వ‌ధు క‌న్, మీండుం సావిత్రి, వైయ్‌క‌రై పొక్క‌ల్‌, కెప్టెన్ మ‌గ‌ల్‌తో పాటు ప‌లు సినిమాల‌తో హీరోగా కోలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు చేరువ‌య్యాడు.

తెలుగులోనూ...

అరుణాచ‌లం, మాప్పిళ్లై, కాద‌ల్ కొట్టై, ల‌వ్ బ‌ర్డ్స్‌తో పాటు ప‌లు త‌మిళ సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా డిఫ‌రెంట్ రోల్స్ చేశాడు రాజా. తెలుగులోనూ ఇర‌వైకిపైగా సినిమాల్లో న‌టించాడు. వైదేహి మూవీతో హీరోగా టాలీవుడ్‌లోకి హీరోగా అడుగుపెట్టాడు. సిరిపురం చిన్నోడు, ఝాన్సీరాణి, చిన్నారి స్నేహం, వ‌నిత‌తో పాటు మ‌రికొన్ని సినిమాల్లో కీల‌క పాత్ర‌లు పోషించాడు.

శ్రీకృష్ణార్జున యుద్ధం మూవీలో ...

1996లో బాల‌కృష్ణ హీరోగా న‌టించిన శ్రీకృష్ణార్జున యుద్ధం మూవీలో క‌ర్ణుడిగా క‌నిపించాడు. ఈ మూవీ త‌ర్వాత 23 ఏళ్ల పాటు దూర‌మైన ద‌గ్గుబాట రాజా మ‌ళ్లీ బాల‌కృష్ణ మూవీతోనే టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఎన్టీఆర్ బ‌యోపిక్‌గా రూపొందిన ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు, ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు సినిమాల్లో నంద‌మూరి త్రివిక్ర‌మ‌రావు పాత్ర‌లో క‌నిపించాడు. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన స్కంద సినిమాలో హీరో రామ్ తండ్రిగా న‌టించాడు.

అస‌లు పేరు వెంక‌టేష్‌...

రాజా అస‌లు పేరు కూడా ద‌గ్గుబాటి వెంక‌టేష్ కావ‌డం గ‌మ‌నార్హం. కానీ అప్ప‌టికే వెంక‌టేష్ హీరోగా ఫేమ‌స్ కావ‌డంతో త‌న స్క్రీన్ నేమ్‌ను రాజాగా మార్చుకొని సినిమాలు చేశాడు.

Whats_app_banner