Bold OTT: ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన తృప్తి డిమ్రి బోల్డ్ మూవీ- 2 నెలలకు రిలీజ్- ట్విస్టులు, రొమాంటిక్ సీన్స్- ఎక్కడంటే?
Vicky Vidya Ka Woh Wala Video OTT Streaming: ఓటీటీలోకి తృప్తి డిమ్రి నటించిన బోల్డ్ మూవీ విక్కీ విద్యా కా వో వాలా వీడియో ఇవాళ వచ్చేసింది. రాజ్ కుమార్ రావు హీరోగా నటించిన ఈ సినిమాను సున్నితమైన కథ, రొమాన్స్, బోల్డ్ అండ్ కామెడీ సీన్స్‌తో తెరకెక్కించారు. మరి ఈ మూవీని ఏ ఓటీటీలో చూడాలో ఇక్కడ తెలుసుకోండి.
Vicky Vidya Ka Woh Wala Video OTT Release: యానిమల్ సినిమాతో నేషనల్ వైడ్‌గా యమ క్రేజ్ తెచ్చుకున్న బ్యూటి తృప్తి డిమ్రి. ఒక్క బెడ్ సీన్‌తో న్యూ నేషనల్ క్రష్‌గా మారిపోయింది గ్లామర్ బ్యూటి తృప్తి డిమ్రి. అంతేకాకుండా యానిమల్ తర్వాత వరుస సినిమాలతో అలరించింది.
బోల్డ్ సినిమాతో
యానిమల్ తర్వాత బ్యాడ్ న్యూజ్ అనే డిఫరెంట్ బోల్డ్ సినిమాతో ఆకట్టుకున్న తృప్తి డిమ్రి ఇదే సంవత్సరంలో విక్కీ విద్యా కా వో వాలా వీడియో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ పాపులర్ యాక్టర్ రాజ్ కుమార్ రావు హీరోగా నటించిన విక్కీ విద్యా కా వో వాలా వీడియో మూవీకి రాజ్ షాందియా దర్శకత్వం వహించారు.
సీనియర్ బ్యూటి మల్లికా షెరావత్
రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన విక్కీ విద్యా కా వో వాలా వీడియో సినిమాలో ఈ ఇద్దరితోపాటు బాలీవుడ్ బోల్డ్ బ్యూటి, సీనియర్ హీరోయిన్ మల్లికా షెరావత్ కీలక పాత్ర పోషించింది. అలాగే, ఇందులో విజయ్ రాజ్, మస్త్ అలీ, అర్చన పురణ్ సింగ్, బిగ్ బాస్ బ్యూటి షెహనాజ్ గిల్, టికు తల్సానియా, ముఖేష్ తివారి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
బడ్జెట్-కలెక్షన్స్
అక్టోబర్ 11న విడుదలైన విక్కీ విద్యా కా వో వాలా వీడియో సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ అందుకుంది. రూ. 30 నుంచి 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన విక్కీ విద్యా కా వో వాలా వీడియో సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 55.51 కలెక్షన్స్ రాబట్టింది. కలెక్షన్స్‌తో పర్వాలేదనిపించిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది.
విక్కీ విద్యా కా వో వాలా వీడియో ఓటీటీ
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విక్కీ విద్యా కా వో వాలా వీడియో ఇవాళ్టి (డిసెంబర్ 7) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ భాషలో మాత్రమే విక్కీ విద్యా కా వో వాలా వీడియో ఓటీటీ రిలీజ్ అయింది. త్వరలో తెలుగు భాషలో కూడా విక్కీ విద్యా కా వో వాలా వీడియో ఓటీటీ స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో
ఇదిలా ఉంటే, సుమారు రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చిన విక్కీ విద్యా కా వో వాలా వీడియో సినిమాను కాస్తా బోల్డ్ సీన్స్ యాడ్ చేసి రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. హీరో హీరోయిన్‌కు కొత్తగా పెళ్లి అవుతుంది. తమ ఫస్ట్ నైట్‌ను జీవితాంతం అందమైన జ్ఞాపకంగా ఉంచుకోవాలని రికార్డ్ చేసి ఓ సీడీలో భద్రపరుస్తారు. అయితే, హీరో హీరోయిన్ లేని సమయంలో వారి ఇంట్లో దొంగలు పడి ఆ సీడీని ఎత్తుకెళ్లిపోతారు.
మూవీ ట్విస్ట్‌లు
ఆ విషయాన్ని హీరో హీరోయిన్ గమనిస్తారు. భార్యాభర్తల ఫస్ట్ నైట్ వీడియో బయటకు లీక్ అయితే ఎలా అని టెన్షన్ పడుతుంటారు. మరి ఆ సీడీ వారికి దొరికిందా? వారి ప్రైవేట్ వీడియోను ఎవరైనా చూసారా? సీడీని దక్కించుకునే క్రమంలో వారు పడ్డ కష్టాలు ఏంటీ? వంటి సున్నితమైన కథను రొమాన్స్, కామెడీ యాడ్ చేసి చిత్రీకరించారు.