Chhava Collections: కలెక్షన్లలో దూసుకెళుతున్న విక్కీ, రష్మిక మూవీ ‘ఛావా’.. మేకర్లకు తెలుగు ఆడియన్స్ డిమాండ్-vicky kaushal rashmika movie chhaava study in collections telugu audience demanding for dubbing version ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chhava Collections: కలెక్షన్లలో దూసుకెళుతున్న విక్కీ, రష్మిక మూవీ ‘ఛావా’.. మేకర్లకు తెలుగు ఆడియన్స్ డిమాండ్

Chhava Collections: కలెక్షన్లలో దూసుకెళుతున్న విక్కీ, రష్మిక మూవీ ‘ఛావా’.. మేకర్లకు తెలుగు ఆడియన్స్ డిమాండ్

Chhaava 5 Days Collections: ఛావా చిత్రం బాక్సాఫీస్ వద్ద జోరుగా సాగుతోంది. వీక్‍డేస్‍లోనూ మంచి కలెక్షన్లను దక్కించుకుంటోంది. ఈ మూవీ విషయంలో మేకర్లకు తెలుగు ఆడియన్స్ చాలా మంది డిమాండ్ చేస్తున్నారు.

Chhaava Collections: ఛావా చిత్రంలో విక్కీ కౌశల్

బాలీవుడ్ మూవీ ‘ఛావా’ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. హీరో విక్కీ కౌశల్, రష్మిక మందన్నా లీడ్ రోల్స్ చేసిన ఈ హిస్టారికల్ యాక్షన్ మూవీ పాజిటివ్ టాక్‍తో దూసుకెళుతోంది. ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు ఛత్రపతి శంబాజీ మహరాజ్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు లక్ష్మణ్ ఉతేకర్. ఫిబ్రవరి 14న రిలీజైన ఛావా వసూళ్లలో దూకుడు చూపిస్తోంది. ఐదు రోజుల్లో ఎంత కలెక్షన్లు దక్కాయంటే..

కలెక్షన్లు ఇలా..

ఛావా చిత్రం ఐదు రోజుల్లో ఇండియాలోనే రూ.165.75 కోట్ల నెట్ కలెక్షన్లను దక్కించుకుంది. ఐదో రోజైన మంగళవారం రూ.25.25 కోట్లను సొంతం చేసుకుంది. సోమవారంతో పోలిస్తే కాస్త వసూళ్లు పెరిగాయి. వీక్‍డే డేస్‍లోనూ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‍గా ముందుగా సాగుతోంది. జోరు పెరిగే అవకాశమే ఉంది.

ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్ల విషయానికి వస్తే ఛావా చిత్రం ఐదు రోజుల్లో రూ.230 కోట్లను దక్కించుకుంది. బుకింగ్‍లను బట్టి చూస్తే ఆరో రోజు కూడా మంచి వసూళ్లు కచ్చితం అనేలా కనిపిస్తోంది. దీంతో త్వరలోనే ఈ చిత్రం ఇండియా రూ.200కోట్ల మార్క్.. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల గ్రాస్ మైలురాయి చేరే అవకాశం కనిపిస్తోంది.

తెలుగు ప్రేక్షకుల డిమాండ్లు

ఛావా చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి కలెక్షన్లను దక్కించుకుంటోంది. అయితే, ఈ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయాలని చాలా మంది సోషల్ మీడియాలో మేకర్లను డిమాండ్ చేస్తున్నారు. తెలుగు వెర్షన్ తీసుకొస్తే కలెక్షన్లు ఇంకా ఊపందుకుంటాయని, మంచి సినిమా ఎక్కువ మందికి చేరుతుందని కొందరు పోస్టులు చేస్తున్నారు. మరి, తెలుగు జనాల డిమాండ్‍ను మేకర్స్ పరిగణనలోకి తీసుకుంటారేమో చూడాలి.

ఛావా చిత్రంలో ఛత్రపతి శాంబాజీ మహరాజ్ పాత్రలో విక్కీ కౌశల్ జీవించేశారు. అతడికి భారీగా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ మూవీలో రష్మిక కూడా రాజసంతో మెప్పించారు. అశుతోశ్ రాణా, అక్షయ్ ఖన్నా, దివ్య, వినీత్ కుమార్ సింగ్, సంతోష్ జువేకర్, ఆలోక్ నాథ్ కీలకపాత్రల్లో కనిపించారు. నటీనటుల పర్ఫార్మెన్స్ ఈ మూవీకి ఓ హైలైట్‍గా నిలిచింది.

ఎక్కువ మందికి పెద్దగా తెలియని ఛత్రపతి శంబాజీ మహరాజ్ జీవిత గాథను తెరపైకి మెప్పించే విధంగా తీసుకురావడంలో దర్శకుడు లక్ష్మణ్ ఉతేకర్ సక్సెస్ అయ్యారు. ఈ మూవీని మాడ్‍డాక్ ఫిల్మ్స్ పతాకంపై దినేశ్ విజన్ నిర్మించారు. ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్ మ్యూజిక్ ఇవ్వగా.. సౌరభ్ గోస్వామి సినిమాటోగ్రఫీ చేశారు. ఈ చిత్రానికి బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ కూడా బలంగా నిలిచాయి.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం