Ranam OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న నందితా శ్వేత మిస్టరీ థ్రిల్లర్ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Ranam OTT: వైభవ్, నందితాశ్వేత హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న మిస్టరీ థ్రిల్లర్ మూవీ రణం ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
Ranam OTT: వైభవ్, నందితా శ్వేత హీరోహీరోయిన్లుగా నటించిన తమిళ మిస్టరీ థ్రిల్లర్ మూవీ రణం ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఏప్రిల్ 19 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఓవర్‌సీస్‌లో టెంట్‌కోటా ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ అవుతోంది. థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత రణం మూవీ ఓటీటీలోకి వస్తోంది.
పది హేను కోట్ల కలెక్షన్స్...
రణం అరమ్ థవరేల్ పేరుతో ఫిబ్రవరి 23న థియేటర్లలో రిలీజైంది. కథ, కథనాలతో పాటు థ్రిల్లింగ్ ట్విస్ట్‌లతో సాగిన ఈ మూవీ ప్రేక్షకుల్ని మెప్పించింది. వైభవ్‌తో పాటు నందితా శ్వేత పాత్రలకు సంబంధించి వచ్చే సర్‌ప్రైజ్‌లు ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఐదు కోట్ల లోపు బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ పదిహేను కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది.
స్కెచ్ ఆర్టిస్ట్ పాత్రలో...
ఓ సీరియల్ కిల్లర్‌ను పట్టుకునే క్రమంలో పోలీస్ ఆఫీసర్‌తో పాటు స్కెచ్ ఆర్టిస్ట్‌కు ఎదురైన పరిణామాలతో దర్శకుడు షరీఫ్... రణం మూవీని తెరకెక్కించాడు. శివ (వైభవ్) ఓ స్కెచ్ ఆర్టిస్ట్. తలలు గుర్తుపట్టకుండా జరిగిన హత్యలను సాల్వ్ చేయడంలో పోలీసులకు సాయం చేస్తుంటాడు. ఓ రోజు సిటీలో ఓ డెబ్‌బాడీకి సంబంధించి పార్ట్‌లు మూడు డిఫరెంట్ ప్లేస్‌లలో దొరుకుతాయి. తల మాత్రం మిస్సవుతుంది.
వరుసగా అలాంటి హత్యలే సిటీలో మరికొన్ని జరుగుతాయి. శివతో కలిసి ఇన్స్‌పెక్టర్ ఇందూజ (తాన్యా హోప్) ఆ సీరియల్ కిల్లర్‌ను ఎలా పట్టుకుంది? వారి ఇన్వేస్టిగేషన్‌లో తేలిన షాకింగ్ విషయాలు ఏమిటి? ఈ హత్యలకు కల్కి అనే అమ్మాయితో ఉన్న సంబంధం ఏమిటి? అన్నదే రణం మూవీ కథ. ఈ సినిమాలో నందితాశ్వేతతో పాటు మరో హీరోయిన్‌గా తాన్య హోప్ నటించింది. ఈ సినిమాలో నందితా శ్వేత నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్ చేసినట్లు సమాచారం.
కోదండరామిరెడ్డి వారసుడిగా...
సీనియర్ టాలీవుడ్ డైరెక్టర్ ఏ కోదండరామిరెడ్డి తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు వైభవ్. గొడవ సినిమాతో వైభవ్‌ను స్వయంగా కోదండరామిరెడ్డి హీరోగా టాలీవుడ్‌కు పరిచయం చేశాడు. ఆ తర్వాత తెలుగులో కాస్కో, యాక్షన్ త్రీడీతో పాటు మరికొన్ని సినిమాలు చేశాడు. అవేవీ అతడికి విజయాల్ని అందించకపోవడంతో కోలీవుడ్‌కు ఫిప్ట్ అయ్యాడు.
తమిళంలో చిన్న సినిమాల్లో హీరోగా నటిస్తూనే స్టార్ హీరోల చిత్రాల్లో ఇంపార్టెంట్ రోల్స్ చేశాడు. తమిళంలో ఎక్కువగా వెంకట్ ప్రభు సినిమాల్లోనే నటించాడు వైభవ్. రణం తమిళంలో వైభవ్ చేసిన 25వ మూవీ. మరోవైపు నందితా శ్వేత కూడా తెలుగులో ఎక్కడికి పోతావు చిన్నవాడా, మంగళవారం, కల్కితో పాటు చాలా సినిమాలు చేసింది.
టాపిక్