Telugu Serial: పాత సీరియల్స్‌కు ఒక్కొక్కటిగా గుడ్‌బై చెబుతోన్న ఈటీవీ ఒకేసారి ఏడు కొత్త సీరియల్స్‌తో బుల్లితెర ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేసేందుకు రెడీ అవుతోంది. డివోషనల్, ఫ్యామిలీ డ్రామా, ఫాంటసీ...ఇలా డిఫరెంట్ జానర్స్‌తో ఈ సీరియల్ తెరకెక్కుతోన్నాయి. ఈ సీరియల్స్ టైటిల్స్ రివీలయ్యాయి.
ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతోన్న వేయి శుభములు కలుగు నీకు సీరియల్ త్వరలో ఈటీవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సీరియల్‌లో మౌనికరెడ్డి, శిల్పా చక్రవర్తి, వీజే సంయుక్త, శ్వేత, జ్యోతి గౌడ కీలక పాత్రల్లో నటిస్తోన్నారు.
వేయి శుభములు కలుగు నీకు సీరియల్ ప్రోమోను ఇటీవల మేకర్స్ రిలీజ్ చేశారు. వారాహి, కళ్యాణి, హాసిని, సునైన అనే నలుగురు అక్కాచెలెళ్ల కథతో ఈ సీరియల్ రూపొందుతోన్నట్లు ఈ ప్రోమోలో చూపించారు. ఈ ప్రోమోలో కృష్ణమ్మగా తల్లి పాత్రలో శిల్పా చక్రవర్తి కనిపించగా...ఆమె కూతుళ్లుగా మౌనికరెడ్డి, వీజే సంయుక్త, శ్వేత, జ్యోతి గౌడ క్యారెక్టర్స్‌ను పరిచయం చేశారు. ఏప్రిల్‌లో ఈ సీరియల్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ఈ సీరియల్‌ను నిర్మిస్తోంది.
వసుంధర పేరుతో ఈటీవీలోకి మరో కొత్త సీరియల్ రాబోతోంది. ఇటీవలే ఈ సీరియల్‌ను లాంఛ్ చేశారు. ఊర్వశివో రాక్షసివో, గీతా ఎల్ఎల్‌బీ సీరియల్స్‌ను నిర్మించిన పోలూరు శ్రీకాంత్ వసుంధర సీరియల్‌ను నిర్మిస్తోన్నారు.
రక్ష నింభార్గి ప్రధాన పాత్రలో మెరుపు కలలు పేరుతో ఓ తెలుగు సీరియల్ రాబోతోంది. ఈ సీరియల్ ఈటీవీలో టెలికాస్ట్ కానుంది.
ఫాంటసీ లవ్ డ్రామాగా రూపొందిన తారా సీరియల్ త్వరలోనే టెలికాస్ట్ కానున్నట్లు ఈటీవీ ప్రకటించింది. హిందీలో విజయవంతమైన ధృవ్‌తార సీరియల్‌కు డబ్బింగ్ వెర్షన్‌గా తార రాబోతోంది.
సంబంధిత కథనం