Jallikattu Ott Release Date: జల్లికట్టు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు? ఎందులో వస్తుందంటే?-vetrimaaran jallikattu ott release date when and where to watch ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Vetrimaaran Jallikattu Ott Release Date When And Where To Watch

Jallikattu Ott Release Date: జల్లికట్టు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు? ఎందులో వస్తుందంటే?

Maragani Govardhan HT Telugu
Apr 23, 2023 04:35 PM IST

Jallikattu Ott Release Date: వెట్రిమారన్ నిర్మాణ సారథ్యంలో తమిళంలో సూపర్ హిట్టయిన జల్లికట్టు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఆహా వేదికగా ఈ షో స్ట్రీమింగ్ కానుంది. ఈ నెలలోనే విడుదల కానుంది.

జల్లికట్టు ఆహా వేదికగా రిలీజ్
జల్లికట్టు ఆహా వేదికగా రిలీజ్

Jallikattu Ott Release Date: ప్రాంతీయ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అవతరించిన ఆహా.. ఇప్పుడు సరిహద్దులు దాటుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా స్ట్రీమింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే తమిళంలో ఆహా సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఇతర భాషల్లో సూపర్ హిట్టుగా నిలిచిన సినిమాలను తెలుగులో డబ్ చేసి ఆహా యాప్‌లో విడుదల చేస్తోంది. తాజాగా ఆహా తమిళంలో సూపర్ హిట్టుగా నిలిచిన పాపులర్ షో పెట్టైకాలిని కూడా తెలుగులో డబ్ చేయనుంది. జల్లికట్టు పేరుతో ఈ షోను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఇటీవల విడుదల లాంటి సూపర్ హిట్‌ను తెరకెక్కించిన వెట్రిమారన్ ఈ షోకు సమర్పకులుగా వ్యవహరించారు.

తమిళనాడులో వివాదాస్పద క్రీడగా మారిన జల్లికట్టు ఆధారంగా ఈ షోను తెరకెక్కించారు. ఓటీటీలో ఈ సిరీస్ హిట్ టాక్‍‌ను తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం డబ్ చేయనున్నారు. ఏప్రిల్ 26 నుంచి ఆహా వేదికగా ఈ షో స్ట్రీమింగ్ కానుంది. ఎల్ఏ రాజ్‌కుమార్ ఈ షోకు దర్శఖత్వం వహించారు. కిషోర్, కలైరాసన్, షీలా రాజ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు.

వీరుకాకుండా పట్టాబీ, సతీష్, గౌతమ్, ఒన్రియమ్ ప్రభు, తెండ్రా స్టెల్లా, మోనిషా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇటీవల విడుదల చేసిన జల్లికట్టు ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఈ ఆట చారిత్రక, సాంస్కృతిక విలువలను ఈ షోలో చెప్పారు. అంతేకాకుండా గ్రామాల్లో ఫ్యాక్షన్ యుద్ధాలు.. వ్యక్తుల మధ్య సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తాయో కూడా చూపారు. కథలో జల్లికట్టు గురించి ప్రత్యేకంగా చూపించనున్నారు.

సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. ఓటీటీ వేదికల్లో విస్తృతంగా ఈ సిరీస్ ఆకట్టుకుంటోంది. జల్లికట్టు తెలుగు వెర్షన్ కూడా బాగా ఆడుతుందని వెట్రిమారన్ తెలిపారు. ఇది తన ప్రతిష్టాత్మక వాడి వాసల్ సినిమాకు ప్రీక్వెల్‌గా తెరకెక్కనున్నట్లు ఆయన అన్నారు. వాడి వాసల్‌లో సూర్య హీరోగా చేస్తున్నారు.

జల్లి కట్టు షోకు సంతోష్ నారాయణ్ సంగీతాన్ని సమకూర్చారు. ఆర్ వెల్‌రాజ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఆర్ సుదర్శన్, రాము తంగరాజ్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఏప్రిల్ 26 నుంచి ఈ షో ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

IPL_Entry_Point

టాపిక్