Action OTT: ఓటీటీలోకి వచ్చిన వెట్రిమారన్ యాక్షన్ మూవీ - తెలుగులోనూ స్ట్రీమింగ్!
Action OTT: వెట్రిమారన్ తమిళ్ యాక్షన్ మూవీ సార్ ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. విమల్ హీరోగా నటించిన ఈ మూవీకి తమిళ మూవీకి నటుడు బోస్ వెంకట్ దర్శకత్వం వహించాడు.
Action OTT: వెట్రిమారన్ తమిళ్ యాక్షన్ డ్రామా మూవీ సార్ థియేటర్లలో రిలీజైన నెలన్నర తర్వాత ఓటీటీలోకి వచ్చింది. రెండు ఓటీటీలలో రిలీజైంది. అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహా ఓటీటీలలో సార్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళంతో పాటు ఐదు భాషల్లో విడుదలకాగా...ఆహా ఓటీటీలో కేవలం తమిళ్ వెర్షన్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది.
కోలీవుడ్ నటుడు...
సార్ మూవీలో విమల్, ఛాయా దేవి హీరోహీరోయిన్లుగా నటించాడు. కోలీవుడ్ నటుడు బోస్ వెంకట్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ ఈ మూవీకి ప్రజెంటర్‌గా వ్యవహరించడం గమనార్హం. వెట్రిమారన్ క్రేజ్ కారణంగా ఈ చిన్న సినిమా తమిళ ఆడియెన్స్‌లో ఆసక్తిని రేకెత్తించింది.
యావరేజ్...
విద్యా వ్యవస్థకు సంబంధించిన ఓ మెసేజ్‌కు కమర్షియల్ హంగులను జోడించి దర్శకుడు బోస్ వెంకట్ ఈ కథను రాసుకున్నాడు. పాయింట్ బాగున్నా ఎంగేజింగ్‌గా చెప్పడంలో దర్శకుడు తడబడటంతో సార్ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది.
సార్ కథ ఇదే...
జ్ఞానం (విమల్) తన తండ్రి పనిచేస్తోన్న స్కూల్‌లో టీచర్‌గా జాయిన్ అవుతాడు. టీచర్ జాబ్ ఇష్టం లేకపోయినా తండ్రి మాట కాదనలేకపోతాడు. తాను టీచర్‌గా పనిచేస్తోన్న ఊరిలో తక్కువ కులం పిల్లలు చాలా మంది చదువుకు దూరమయ్యారని జ్ఞానం తెలుసుకుంటాడు. వారందరని స్కూల్‌లో చేర్పించే ప్రయత్నంలో ఊరి పెద్ద శక్తివేల్‌తో జ్ఞానానికి విరోధం ఏర్పడుతుంది.
జ్ఞానం పనిచేసేస్కూల్‌ను శక్తివేల్ కూలగొట్టే ప్రయత్నం చేస్తాడు. శక్తివేల్ రాజకీయ, ధన బలం నుంచి జ్ఞానం తన స్కూల్‌ను ఎలా కాపాడుకున్నాడు? ఈ పోరాటంలో వల్లి అతడికి ఎలా అండగా నిలిచింది? అన్నదే ఈ మూవీ కథ.
డైరెక్టర్‌గా బోస్ వెంకట్‌కు ఇది సెకండ్ మూవీ. గతంలో విమల్‌తోనే కన్నీమాడమ్ అనే సినిమా చేశాడు. నటుడిగా బోస్ వెంకట్ తమిళంలో వందకుపైగా సినిమాలు చేశాడు.