Bigg Boss 7 Telugu Day 16 Promo 2: ‘వేలు దించు..చిల్లర లొల్లి’: రైతుబిడ్డ ప్రశాంత్ - రతిక మధ్య ఫైట్: వీడియో
Bigg Boss 7 Day 16 Promo 2: బిగ్బాస్ తెలుగు 7వ సీజన్‍లో కంటెస్టెంట్‍ల మధ్య గొడవలు నానాటికీ పెరుగుతున్నాయి. తాజాగా, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్, రతిక మధ్య తీవ్రమైన మాటల యుద్ధం జరిగింది.
Bigg Boss 7 Day 16 Promo 2: బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. ప్రస్తుతం మూడో వారం జరుగుతోంది. అయితే, ఈ సీజన్‍లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్, రతికపై కాస్త ఎక్కువ ఫోకస్ ఉంది. తొలివారంలో ఈ ఇద్దరూ చాలా క్లోజ్‍గా మూవ్ అయ్యారు. ప్రేమికులుగా మారనున్నారా అనే సందేహాలను కల్పించారు. ఓ దశలో రతికకు గోరు ముద్దలు తినిపించారు ప్రశాంత్. కొన్నిసార్లు ఇద్దరూ గుసగుసలాడుతున్నారు. అయితే, రెండో వారంలో సీన్ మారింది. ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. మూడో వారంలోనూ ఇది కొనసాగుతున్నట్టు కనిపిస్తోంది. బిగ్‍బాస్ 16వ రోజు ప్రశాంత్ - రతిక మధ్య గొడవ జరిగింది. ఈ విషయం తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో ఉంది.
ట్రెండింగ్ వార్తలు
“పో తల్లి పో”.. అని ప్రశాంత్ అంటే.. “నువ్వే పో” అని రతిక అన్నారు. దీంతో ఇద్దరి మధ్య గొడవ షురూ అయింది. ఎక్కువ మాట్లాడుతున్నావంటూ ప్రశాంత్ వైపు వేలు చూపిస్తూ వాదించారు రతిక. అయితే, “వేలు దించు.. వేలు దించు” అంటూ సీరియస్ అయిన పల్లవి ప్రశాంత్.. రతికపై చేయి వేసి పక్కకు నెట్టారు. దీంతో “ఏయ్ ఇంకోసారి.. చేయి వేస్తే మర్యాదగా ఉండదు.. చెబుతున్నా” అంటూ ప్రశాంత్‍కు రతిక వార్నింగ్ ఇచ్చారు. చిల్లర లొల్లి.. చిల్లర అంటూ రతికను చూసి ప్రశాంత్ అన్నారు. ఇలా వారి మధ్య గొడవ జరిగింది. నేటి ఎపిసోడ్‍లో ఈ గొడవను పూర్తి చూడవచ్చు. అయితే, వీరిద్దరూ నిజంగానే ఇంత సీరియస్‍గా గొడవ పడ్డారా.. హౌస్‍మేట్స్ ముందు ఏమైనా ప్రాంక్ చేశారా అనేది ఎపిసోడ్‍లో తెలియనుంది.
వినాయకుడి పూజతో బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ 16వ రోజు మొదలుకానుందని ప్రోమోలో ముందుగా ఉంది. అనంతరం, మూడు వారాల ఇమ్యూనిటీని ఇచ్చే మూడో పవర్ అస్త్ర కోసం అమర్ దీప్, ప్రిన్స్ యావర్, శోభాశెట్టిను సెలెక్ట్ చేసినట్టు బిగ్‍బాస్ ప్రకటించారు. దీంతో తాను బిగ్‍బాస్ మనసులో ఓడిపోయానంటూ ప్రశాంత్ బాధపడ్డారు. ఆ తర్వాత కంటెస్టెంట్లను కన్ఫెషన్ రూమ్‍కు బిగ్‍బాస్ పిలిచారు. అమర్, యావర్, శోభాశెట్టిలో కంటెండర్‌షిప్‍కు ఎవరు అర్హులు కాదోనని మిగిలిన కంటెస్టెంట్‍లను బిగ్‍బాస్ అడిగారు. కంటెస్టెంట్లు చెప్పారు. కొందరు కంటెస్టెంట్లు కన్ఫెషన్ రూమ్‍లో చెప్పిన విషయాలను అందరి ముందు చూపిస్తానని బిగ్‍బాస్ చెప్పటంతో అందరూ షాక్ అయ్యారు. మరి.. 16వ రోజు ఏం జరిగిందో పూర్తిగా తెలియాలంటే నేటి బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ ఎపిసోడ్ చూడాలి.
టాపిక్