Athidhi Trailer: ఓటీటీలోకి సరికొత్త హారర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎందులో అంటే?
Athidhi OTT: హారర్ చిత్రాలకు ఎప్పుడూ మంచి క్రేజ్ ఉంటుంది. అందుకే సినీ ప్రియులు వాటిపై ఓ నజర్ వేస్తుంటారు. ఇక వారికి తగినట్లే మేకర్స్ హారర్ చిత్రాలను, సిరీసులను రూపొందిస్తుంటారు. అలా తాజాగా నేరుగా ఓటీటీలోకి వస్తున్న హారర్ వెబ్ సిరీస్ అతిథి. ఈ అతిథి సిరీస్ స్ట్రీమింగ్ విషయాల్లోకి వెళితే..
ప్రముఖ నటుడు వేణు తొట్టెంపూడి ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. రవితేజ రామారావు ఆన్ డ్యూటి మూవీతో వేణు తొట్టెంపూడి అలరించిన సినిమా అంతగా క్లిక్ కాలేదు. ఇప్పుడు ఆయన నేరుగా ఓటీటీలోకి అడుగు పెట్టాడు. వేణు తొట్టెంపూడి తాజాగా నటించిన ఓటీటీ వెబ్ సిరీస్ అతిథి. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‍స్టార్ స్పెషల్స్ గా రూపొందించిన అతిథి వెబ్ సిరీసులో వేణుతోపాటు అవంతిక, అదితి గౌతమ్, వెంకటేష్ కాకుమాను, రవి వర్మ, భద్రం, చానక్య తేజ, గాయత్రి చాగంటి, పూజ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
ట్రెండింగ్ వార్తలు
అతిథి వెబ్ సిరీసుకు రాండమ్ ఫ్రేమ్స్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్‍పై డైరెక్టర్ భరత్ వైజీ దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు షో రన్నర్‍గా వ్యవహరిస్తున్నారు. తాజాగా అతిథి వెబ్ సిరీస్ ట్రైలర్‍ను విడుదల చేశారు. ఇందులో వేణు రైటర్ కవిగా కనిపించినున్నట్లు తెలుస్తోంది. ఒంటరిగా అతిపెద్ద భవంతిలో ఉంటున్న రవికి దెయ్యాలంటే పెద్దగా నమ్మకం ఉండదు. రవి ఉంటున్న ఇంట్లో అనుకోకుండా గెస్టుగా ఓ అమ్మాయి వస్తుంది. ఆ ఆమ్మాయి దెయ్యం అని రవికి తన ఫ్రెండ్ చెప్పిన వినడు.
రవి ఇంట్లోకి అమ్మాయి వచ్చిన తర్వాత అనుకోని, విచిత్రపు సంఘటనలు జరుగుతుంటాయి. అతిథిలా వచ్చిన అమ్మాయి వింతగా ప్రవరిస్తుంటుంది. ఇంతకీ ఆమె ఎవరు..? మనిషా?, దెయ్యామా?, ఆ భవంతి చరిత్ర ఏంటి? అనే విషయాలతో అతిథి సిరీస్ తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. ట్రైలర్‍లో 'కథలకు ముగింపు ఇద్దామా?' అని ఆ అమ్మాయి చెప్పడం మరింత ఆసక్తి పెంచింది. కాగా అతిథి వెబ్ సిరీసును డిస్నీ ప్లస్ హాట్‍స్టార్‍లో సెప్టెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. అంటే హారర్ చిత్రాలు, సిరీసులు ఇష్టపడేవారికి మరో కొత్త సిరీస్ రానుందన్నమాట. హాట్‍స్టార్‍లో వచ్చిన సేవ్ ది టైగర్స్, దయ వంటి సిరీసులు మంచి టాక్ తెచ్చుకున్నాయి. మరి అతిథి ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.