OTT Super Hero Movie: ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్‍బస్టర్ సూపర్ హీరో మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Venom The Last Dance OTT streaming: వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్ సినిమా ఎట్టకేలకు రెంట్ లేకుండా స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ఇండియాలో ఈ మూవీ రెగ్యులర్ స్ట్రీమింగ్ మొదలైంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
‘వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్’ సినిమా గతేడాది అక్టోబర్ 25వ తేదీన ఫుల్ హైప్ మధ్య రిలీజ్ అయింది. పాపులర్ సూపర్ హీరో ఫ్రాంచైజీ వెనమ్‍లో మూడో మూవీగా ఇది వచ్చింది. అంచనాలకు తగ్గట్టే బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం రెంటల్ విధానంలో ఓటీటీల్లో అందుబాటులో వచ్చింది. నేడు (జనవరి 25) రెంట్ లేకుండా పూర్తిస్థాయి స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది.
స్ట్రీమింగ్ ఎక్కడంటే..
నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్ సినిమా స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. రెంట్ లేకుండా స్ట్రీమ్ అవుతోంది. నెట్‍ఫ్లిక్స్ సబ్‍స్క్రైబర్లందరూ ఈ చిత్రాన్ని చూసేయవచ్చు. ఈ చిత్రం జీ5, అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇప్పటికే రెంటల్ విధానంలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. అయితే, ఇప్పుడు రెంట్ లేకుండా రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది.
మొత్తంగా థియేటర్లలో రిలీజైన నాలుగు నెలలకు వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్ చిత్రం రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ మూవీ పూర్తిస్థాయి స్ట్రీమింగ్ కోసం చాలా ప్రేక్షకులు ఎదురుచూశారు. ఎట్టకేలకు ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్‌లోకి అడుగుపెట్టేసింది.
వెనమ్ ట్రయాలజీలో చివరి మూవీగా ది లాస్ట్ డ్యాన్స్ వచ్చింది. ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చినా.. బాక్సాఫీస్‍పరంగా బ్లాక్‍బస్టర్ అయింది. ఈ మూవీలో టామ్ హార్డ్లీ లీడ్ రోల్ చేశారు. ఈ చిత్రానికి కెల్లీ మార్కెల్ దర్శకత్వం వహించారు.
సూపర్ హిట్‍గా..
వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్ చిత్రం కమర్షియల్‍గా సూపర్ హిట్ అయింది. 120 మిలియన్ డాలర్లతో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 476 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.4వేల కోట్లు) కలెక్షన్లు దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది.
వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్ మూవీలో టామ్ హార్డ్లీతో పాటు జునో టెంపుల్, రిన్స్ ఇఫాన్స్, చివెటెల్ ఇజియోఫర్, క్లార్క్ బాకో, అలనా ఉబాచ్, స్టీఫెన్ గ్రహం కీరోల్స్ చేశారు. మార్వెల్ కామిక్స్ ఆధారంగా ఈ సూపర్ హీరో మూవీని డైరెక్టర్ కెల్లీ మార్కెల్. ఈ చిత్రాన్ని అవి అరద్, మ్యాట్ టోమ్లాచ్, ఏమీ పాస్కల్, కెల్లీ మార్కెల్, టామ్ హార్డ్లీ, హాచ్ పార్కర్ సంయుక్తంగా ప్రొడ్యూజ్ చేశారు.
సంబంధిత కథనం