Bedurulanka 2012 First Single: బెదురులంక నుంచి ఫస్ట్ పాట వచ్చేసింది.. కార్తికేయ-నేహా కెమిస్ట్రీ అదుర్స్-vennello aadapilla lyrical song released from kartikeya bedurulanka 2012 movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bedurulanka 2012 First Single: బెదురులంక నుంచి ఫస్ట్ పాట వచ్చేసింది.. కార్తికేయ-నేహా కెమిస్ట్రీ అదుర్స్

Bedurulanka 2012 First Single: బెదురులంక నుంచి ఫస్ట్ పాట వచ్చేసింది.. కార్తికేయ-నేహా కెమిస్ట్రీ అదుర్స్

Maragani Govardhan HT Telugu
Mar 07, 2023 01:19 PM IST

Bedurulanka 2012 First Single: టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ నటించిన సరికొత్త చిత్రం బెదురులంక 2012. నేహా శెట్టి హీరోయిన్‌గా చేస్తున్న ఈ సినిమా నుంచి తొలి పాట వచ్చేసింది. వెన్నెల్లో ఆడపిల్ల అంటూ సాగే ఈ పాట అదిరిపోయింది. కార్తికేయ-నేహా కెమిస్ట్రీ ఆకట్టుకుంది.

బెదురులంక 2012 నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల
బెదురులంక 2012 నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల

Bedurulanka 2012 First Single: ఆర్ఎక్స్ 100, గుణ 369 లాంటి సూపర్ హిట్ చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తికేయ. ప్రస్తుతం అతడు హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం బెదురులంక 2012. ఈ సినిమాలో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్‌గా చేస్తంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. దీంతో సినిమాలు అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. బెదురులంక 2012 మూవీ నుంచి ఫస్ట్ పాటను విడుదల చేసింది.

ఈ పాట ఆద్యంతం అలరిస్తోంది. "వెన్నెల్లో ఆడపిల్ల.. కవ్వించే కన్నెపిల్ల" అంటూ సాగే ఈ బ్యూటీఫుల్ రొమాంటిక్ సాంగ్ ఆకట్టుకుంటోంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ సాంగ్ శ్రోతలను మెప్పించేలా సాగుతోంది. ఈ సాంగ్‌ను హారిక నారాయణ్, వీ సుధాన్షు అద్భుతంగా ఆలపించారు. కిట్టు విస్సప్రగడ ఈ సాంగ్‌ను రాశారు. మణిశర్మ అందించిన ట్యూన్ అద్భుతంగా ఉంది.

ఈ లిరికల్ వీడియోలో కార్తికేయ, నేహా శెట్టి కెమిస్ట్రీ అదిరిపోయింది, డీజే టిల్లు సినిమాలో అందాల ఆరబోతతో అదరగొట్టిన నేహా శెట్టి ఈ సినిమాలో పుల్ లెంగ్త్ లంగా ఓణీలో కనిపిస్తుంది. అయితే ఈ పాటలో మాత్రం అందాలతో కుర్రాకారుకు చెమటలు పట్టించేలా ఉంది. థియేటర్లో చూస్తే ఈ పాట సినిమాకే హైలెట్‌గా నిలిచేలా ఉంది.

కార్తికేయ, నేహా శెట్టి కలిసి నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, 'ఆటో' రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నాడు. లౌక్య ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మాతగా వ్యవహరించారు.

సంబంధిత కథనం

టాపిక్