Comedy Thriller OTT: మరో ఓటీటీలోకి వచ్చిన టాలీవుడ్ కామెడీ థ్రిల్లర్ మూవీ - నవ్విస్తూనే ట్విస్ట్‌లతో థ్రిల్!
Comedy Thriller OTT: వెన్నెలకిషోర్ కామెడీ థ్రిల్లర్ మూవీ శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ మరో ఓటీటీలోకి వచ్చింది. ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ తాజాగా బుధవారం అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. ఈ సినిమాలో అనన్య నాగళ్ల హీరోయిన్‌గా నటించింది.

Comedy Thriller OTT: వెన్నెల కిషోర్ కామెడీ థ్రిల్లర్ మూవీ శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ మరో ఓటీటీలోకి వచ్చింది.ఇప్పటికే ఈ మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. బుధవారం అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజైంది. ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండా సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మూవీ.
అనన్య నాగళ్ల...
వెన్నెల కిషోర్ హీరోగా నటించిన ఈ మూవీలో అనన్య నాగళ్ల, రవితేజ మహాదాస్యం, శియా గౌతమ్ కీలక పాత్రల్లో నటించాడు. డిటెక్టివ్ కామెడీ థ్రిల్లర్‌గా దర్శకుడు రైటర్ మోహన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. సునీల్ కశ్యప్ మ్యూజిక్ అందించాడు.
చంటబ్బాయి తాలూకా...
క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ థియేటర్లలో రిలీజైంది. వెన్నెలకిషోర్ హీరో కావడం, చంటబ్బాయి తాలూకా అనే క్యాప్షన్‌తో పాటు టీజర్, ట్రైలర్స్ డిఫరెంట్‌గా ఉండటంతో శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ ఓ మోస్తారు అంచనాలతో రిలీజైంది. కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా దానిని తెరపై చెప్పిన తీరు కన్ఫ్యూజింగ్‌గా ఉండటంతో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీని శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించాడు దర్శకుడు.
శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ కథ ఇదే...
రాజీవ్‌గాంధీ చనిపోయిన రోజే మేరీ అనే యువతి శ్రీకాకుళం బీచ్‌లో చనిపోతుంది. ఈ కేసులో హంతకులను పట్టుకునే పనిని ప్రైవేట్ డిటెక్టివ్ షెర్లాక్‌హోమ్స్‌కు అప్పగిస్తాడు సీఐ భాస్కర్. మేరీని హత్యతో ఆమె స్నేహితురాలు భ్రమరాంభ( అనన్య నాగళ్ల), బాలు(రవితేజ మహాదాస్యం)తో పాటు మరో ఐదుగురితో సంబంధం ఉండొచ్చని షెర్లాక్‌హోమ్స్ అనుమానిస్తాడు. వారిని విచారిస్తాడు.ఈ విచారణలో ఏం తేలింది? మేరిని హత్య చేసింది ఎవరు అన్నదే ఈ మూవీ కథ.
ప్రమోషన్స్‌కు దూరం...
శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ మూవీ ప్రమోషన్స్‌కు వెన్నెలకిషోర్ హాజరుకాలేదు. అతడి వల్లే సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయిందంటూ డైరెక్టర్‌తో పాటు మేకర్స్ విమర్శలు గుప్పించారు.
టాలీవుడ్‌లో బిజీ...
ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీయెస్ట్ కమెడియన్‌లలో ఒకరిగా వెన్నెలకిషోర్ కొనసాగుతోన్నాడు. గత ఏడాది 20కిపైగా సినిమాలు చేశాడు. ఇటీవల రిలీజైన బ్రహ్మా ఆనందం మూవీలో వెన్నెలకిషోర్ పాత్రకు మంచి స్పందన లభిస్తోంది.
పవన్ కళ్యాణ్ వకీల్‌సాబ్‌లో
మరోవైపు అనన్య నాగళ్ల కూడా హీరోయిన్‌గా చిన్న సినిమాలు చేస్తూనే పెద్ద సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ చేస్తోంది. మల్లేషం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అనన్య...పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్‌లో ఓ ఇంపార్టెంట్ రోల్ చేసింది. 2014లో శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్‌తో పాటు తంత్ర, పొట్టేల్ సినిమాలు చేసింది. బహిష్కరణ వెబ్‌సిరీస్ ద్వారా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సిరీస్‌లో డీ గ్లామర్ పాత్రలో కనిపించింది.
సంబంధిత కథనం
టాపిక్