Sankranthiki Vasthunam: పుష్ప 2 అయింది.. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం వంతు
Sankranthiki Vasthunam: సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ఆఖరి ఈవెంట్ జరగనుంది. భారీ బ్లాక్‍బస్టర్ అయిన ఈ మూవీ కోసం థ్యాంక్స్ మీట్ లాంటిది నిర్వహించనుంది మూవీ టీమ్. డేట్ కూడా ఖరారు చేసింది.

సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్సాఫీస్‍ను షేక్ చేసింది. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ఈ ఫ్యామిలీ కామెడీ డ్రామా మూవీ అందరి అంచనాలను మించిపోయి భారీ బ్లాక్‍బస్టర్ కొట్టేసింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన రిలీజైన ఈ మూవీ టాలీవుడ్ రీజనల్ చిత్రాల్లో కొత్త రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి ఆఖరి ఈవెంట్ జరగనుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భారీ బ్లాక్‍బస్టర్ పుష్ప 2 థ్యాంక్స్ మీట్ శనివారమే (ఫిబ్రవరి 8) జరగగా.. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం టీమ్ అలాంటి ఈవెంటే నిర్వహించనుంది. ఆ వివరాలు ఇవే..
విక్టరీ వేడుక ఎప్పుడంటే..
సంక్రాంతికి వస్తున్నాం సినిమా థ్యాంక్స్ మీట్‍ను విక్టరీ వేడుక పేరుతో మూవీ టీమ్ నిర్వహించనుంది. రేపు (ఫిబ్రవరి 10) సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్‍లో ఈ ఈవెంట్ జరగనుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది.
రీజనల్ చిత్రాల్లో ఆల్‍టైమ్ ఇండస్ట్రీ హిట్‍ను సెలెబ్రేట్ చేసుకోనున్నామంటూ ఓ పోస్టర్ కూడా నేడు రివీల్ చేసింది శ్రీ వెంకటేశ్వ క్రియేషన్స్ బ్యానర్. సంక్రాంతికి వస్తున్నాం విక్టరీ వేడుక రేపు సాయంత్రం 6 గంటల నుంచి అంటూ ట్వీట్ చేసింది.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా కోసం హీరో వెంకటేశ్, హీరోయిన్లు ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి, దర్శకుడు అనిల్ రావిపూడి సహా టీమ్ సభ్యులు రిలీజ్ ముందు నుంచి విపరీతంగా ప్రమోషన్లు చేశారు. రిలీజ్ తర్వాత కూడా జోరుగా ఈవెంట్లలో పాల్గొన్నారు. ఈ మూవీ ఇంత పెద్ద సక్సెస్ సాధించడం వెనుక ప్రమోషన్లు కూడా బాగా తోడ్పడ్డాయి. పాటలు కూడా పాపురల్ అవడం కూడా ఈ చిత్రానికి బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు ఈ బ్లాక్‍బస్టర్ మూవీకి ఆఖరి ఈవెంట్ జరగనుంది.
ఇండస్ట్రీ హిట్ ఇలా..
సంక్రాంతికి వస్తున్నాం చిత్రం రూ.300కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించినట్టు మూవీ టీమ్ వెల్లడించింది. తెలుగులో రీజనల్ చిత్రంగా రిలీజై రూ.300కోట్ల కలెక్షన్ల మార్క్ దాటిన తొలి చిత్రంగా ఇది రికార్డు సృష్టించింది. తెలుగు ప్రాంతీయ చిత్రాల్లో ఆల్‍టైమ్ ఇండస్ట్రీ హిట్‍గా నిలిచిందని మూవీ టీమ్ ప్రకటించింది. ఈ చిత్రంతోనే తొలిసారి రూ.200కోట్లు, రూ.300 కోట్ల క్లబ్‍లోకి వెంకటేశ్ అడుగుపెట్టారు. రూ.50కోట్లలోపు బడ్జెట్‍తో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ అనుకున్న దాని కంటే భారీ బ్లాక్‍బస్టర్ సాధించింది.
పండుగకు సూటయ్యేలా ఫ్యామిలీ కామెడీ మూవీగా సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించారు. ఈ మూవీలో తన కామెడీ టైమింగ్‍తో మరోసారి అదరగొట్టారు వెంకటేశ్. భార్య, పోలీస్ అయిన మాజీ ప్రియురాలి మధ్య నలిగే పాత్రలో వెంకీ సూపర్ అనిపించారు. ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి నటనకు కూడా ఫుల్ మార్క్స్ పడ్డాయి. ఈ చిత్రానికి భీమ్స్ సెసిరోలియో మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం సక్సెస్‍కు పాటలు బాగా ప్లస్ అయ్యాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‍రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
సంబంధిత కథనం