Fantasy OTT: మూడేళ్ల తర్వాత మరో ఓటీటీలోకి వచ్చిన తెలుగు ఫాంటసీ మూవీ - వెంకటేష్ సినిమా స్ట్రీమింగ్ ఎందులో అంటే?
Fantasy OTT:విశ్వక్‌సేన్ హీరోగా నటించిన ఓరి దేవుడా మూవీ థియేటర్లలో రిలీజైన మూడేళ్ల తర్వాత మరో ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ శనివారం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. రొమాంటిక్ ఫాంటసీ మూవీలో హీరో వెంకటేష్ గెస్ట్ పాత్రలో నటించాడు.
Fantasy OTT: విశ్వక్‌సేన్ హీరోగా నటించిన ఓరి దేవుడా మూవీ ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ మూవీ మరో ఓటీటీలోకి వచ్చింది. శనివారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రిలీజైంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది. థియేటర్లలో రిలీజైన మూడేళ్ల తర్వాత ఈ రొమాంటిక్ కామెడీ ఫాంటసీ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కావడం గమనార్హం.
గెస్ట్ పాత్రలో...
విశ్వక్‌సేన్ హీరోగా నటించిన ఓరి దేవుడా మూవీలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ పాత్రలో నటించాడు. ఈ మూవీలో విశ్వక్‌సేన్‌కు జోడీగా మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరోయిన్లుగా కనిపించారు. ఓరి దేవుడా సినిమాకు డ్రాగన్ ఫేమ్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించాడు.
తమిళ రీమేక్...
తమిళంలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఓ మై కడవులే ఆధారంగా ఓరి దేవుడా మూవీ తెరకెక్కింది. తమిళంలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ మూవీ తెలుగులో మాత్రం యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. బాక్సాఫీస్ వద్ద పది కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. ఓరి దేవుడా సినిమాలోని పాటలు మాత్రం మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకున్నాయి. ఓరి దేవుడా మూవీకి డైరెక్టర్ తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందించారు.
దేవుడి పాత్రలో...
ఈ ఫాంటసీ మూవీలో వెంకటేష్ దేవుడి పాత్రలో గెస్ట్ రోల్‌లో కనిపించాడు. అర్జున్, అను చిన్ననాటి నుంచి స్నేహితులు. ఇద్దరు పెళ్లిచేసుకుంటారు. ఆ తర్వాతే వారి మధ్య గొడవలు మొదలవుతాయి. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. ప్రేమ, పెళ్లి విషయంలో తనకు సెకండ్ ఛాన్స్ ఇవ్వమని దేవుడిని వేడుకుంటాడు అర్జున్. అందుకు అంగీకరించిన దేవుడు...కొన్ని కండీషన్స్ మాత్రం పెడతాడు. అవేమిటి? అర్జున్ జీవితంలోకి వచ్చిన మీరా ఎవరు? అర్జున్, అను విడాకులు తీసుకున్నారా? అన్నదే ఈ మూవీ కథ. ఓరి దేవుడా మూవీకి లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందించాడు.
లైలా మూవీ...
ఇటీవలే లైలా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు విశ్వక్‌సేన్. థియేటర్లలో ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ యాక్షన్ కామెడీ సినిమాలో విశ్వక్‌సేన్ లేడీ గెటప్‌లో కనిపించాడు. కాన్సెప్ట్‌తో పాటు డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువ కావడం, కామెడీ అనుకున్న స్థాయిలో వర్కవుట్ కాకపోవడంతో ఈ సినిమా నిర్మాతలకు పెద్ద షాకిచ్చింది.
బ్లాక్‌బస్టర్...
మరోవైపు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు వెంకటేష్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ థియేటర్లలో మూడు వందల కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.
సంబంధిత కథనం