Sankranthiki Vasthunam Songs: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న సంక్రాంతికి వస్తున్నాం 3 సాంగ్స్.. అన్నీ టాప్ ట్రెండింగ్‌లో!
Sankranthiki Vasthunnam Songs Trending On YouTube: విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో పాటలు యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్నాయి. ఇప్పటికీ విడుదలైన మూడు పాటలు అత్యధిక వ్యూస్ తెచ్చుకుని చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. ఏ పాట ఏ స్థానంలో ఉంది, వ్యూస్ ఎన్ని వచ్చాయో చూద్దాం.
Sankranthiki Vasthunnam Songs Trending On YouTube: ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. కామెడీ చిత్రాలకు పేరుగాంచిన డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ మూవీకి దర్శకత్వం వహించారు.
మూడు పాటలు ట్రెండింగ్‌లో
ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాను దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. అయితే, తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. విడుదలైన మూడు పాటలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన గోదారి గట్టు, మీను, బ్లాక్ బస్టర్ పొంగల్ ట్రాక్స్ యూట్యూబ్, అన్ని మ్యూజిక్ చార్ట్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో మోత మొగిస్తున్నాయి.
ఏ పాటది ఏ స్థానమంటే?
వెంకటేష్ ఆలపించిన బ్లాక్‌బస్టర్ పొంగల్ సాంగ్ ప్రస్తుతం 3వ స్థానంలో ఉంటూ పండగ వైబ్‌ని రెట్టింపు చేసింది. ఇక భీమ్స్ సిసిరోలియో, ప్రణవి ఆచార్య పాడిన మీను సాంగ్ 6వ స్థానంలో ఆడియన్స్‌ను అలరిస్తోంది. విడుదలైనప్పటి నుంచే టాప్ ట్రెండింగ్‌లో ఉన్న గోదారిగట్టు సాంగ్ 10వ స్థానంలో అదరగొడుతోంది. ఈ పాటను రమణ గోగుల, మధుప్రియ ఆలపించారు.
85 మిలియన్ల వ్యూస్
ఈ సంక్రాంతికి వస్తున్నాం మూడు పాటలు గోదారి గట్టు, మీను, బ్లాక్ బస్టర్ పొంగల్ మూడు పాటలకు యూట్యూబ్‌లో 85 మిలియన్ల వ్యూస్ దాటాయి. అంటే దాదుపుగా 8.5 కోట్ల వ్యూస్ రాబట్టాయి ఈ మూడు సాంగ్స్. ఈ రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ సంక్రాంతికి వస్తున్నాం పాటలకున్న పాపులారిటీని తెలియజేస్తున్నాయి. అలాగే, ఈ సాంగ్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఫ్యాన్స్ డ్యాన్స్ కవర్‌లు, రీల్స్‌లో కూడా టాప్ ట్రెండింగ్‌లో ఉన్నాయి.
100 మిలియన్ వ్యూస్‌కు దగ్గరిగా
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్, నెటిజన్స్ సంక్రాంతికి వస్తున్నాం పాటలపై కవర్ సాంగ్స్, రీల్స్ చేస్తూ హుక్ స్టెప్స్ వేస్తున్నారు. ఈ మూడు పాటలు 100 మిలియన్ వ్యూస్‌కి చేరువకానున్నాయి. ఇలా సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన 'సంక్రాంతికి వస్తున్నాం' ఆల్బమ్ ఈ సీజన్‌లో మోస్ట్ సెలబ్రేటెడ్ ఆల్బమ్‌గా అదరగొడుతోంది.
అంతా ఎక్స్
ఇదిలా ఉంటే, సంక్రాంతికి వస్తున్నాం మూవీలో వెంకటేష్ ఎక్స్ పోలీస్‌గా నటిస్తుంటే ఆయనకు జోడీగా ఎక్స్ భార్యగా ఐశ్వర్య రాజేష్, ఎక్స్ లవర్‌గా మీనాక్షి చౌదరి నటించారు. వీరితోపాటు సినిమాలో ఉపేంద్ర లిమాయే, సాయి కుమార్, నరేష్, వీటీ గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్ మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా, చిట్టి ఇతర పాత్రలు చేశారు.
సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ డేట్
కాగా సంక్రాంతికి వస్తున్నాం మూవీ జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి సినిమాటోగ్రఫీని సమీర్ రెడ్డి నిర్వహిస్తుండగా.. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా వర్క్ చేశారు. అలాగే, చిత్రానికి స్క్రీన్‌ప్లేను ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ అందించగా, వి వెంకట్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేశారు.
టాపిక్