Venkatesh Movie Tv Premiere Date: టీవీలోకి రానున్న వెంకటేష్ మూవీ - ప్రీమియర్ డేట్ ఇదే
Venkatesh Movie Tv Premiere Date: వెంకటేష్ ముఖ్య పాత్రలో నటించిన ఓరి దేవుడా మూవీ టీవీ ప్రీమియర్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఈ సినిమా ఏ టీవీలో ఏ రోజు టెలికాస్ట్ కానుందంటే...
Venkatesh Movie Tv Premiere Date: ఫ్యామిలీ హీరో వెంకటేష్ కీలక పాత్రలో నటించిన ఓరి దేవుడా మూవీ టీవీ ప్రీమియర్ డేట్ ఫిక్సయింది. రొమాంటిక్ ఫాంటసీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో విశ్వక్‌సేన్ హీరోగా నటించాడు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఫస్ట్ టీవీ ప్రీమియర్ డేట్ ఖరారైంది. ఏప్రిల్ 30న సాయంత్రం ఆరు గంటలకు జెమినీ టీవీలో ఈ మూవీ టెలికాస్ట్ కానుంది.
ఓరి దేవుడా సినిమాలో మిథిలా పాల్కర్, ఆశాభట్ హీరోయిన్లుగా నటించారు. ప్రేమలో విఫలమైన ఓ యువకుడికి దేవుడు సెకండ్ ఛాన్స్ ఇస్తాడు. ఆ ఛాన్స్‌ను అతడు ఎలా వినియోగించుకున్నాడన్నది వినోదాత్మక పంథాలో దర్శకుడు అశ్వత్ మారిముత్తు ఈ సినిమాలో చూపించారు. ఇందులో లవర్‌బాయ్‌గా విశ్వక్‌సేన్ నటించగా దేవుడిగా కీలకమైన అతిథి పాత్రలో వెంకటేష్ నటించారు.
తమిళంలో విజయవంతమైన ఓ మై కడావులే ఆధారంగా ఓరి దేవుడా మూవీ రూపొందింది. తమిళంలో పెద్ద విజయాన్ని సాధించిన ఈ మూవీ తెలుగులో మాత్రం ఆ రిజల్ట్‌ను పునరావృతం చేయలేకపోయింది.
దాంతో థియేటర్లలో విడుదలైన ఇరవై రోజుల్లోనే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేశారు. పీవీపీ సినిమాస్‌తో కలిసి అగ్ర నిర్మాత దిల్‌రాజు ఓరి దేవుడా సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించాడు.