Venkatesh Singing: ఏడేళ్ల తర్వాత మళ్లీ పాట పాడనున్న వెంకటేష్.. సంక్రాంతికి వస్తున్నాంలో స్పెషల్ సాంగ్.. వీడియో రిలీజ్
Venkatesh Singing Song For Sankranthiki Vasthunnam: విక్టరీ వెంకటేష్ మరోసారి తన గాత్రం వినిపించనున్నాడు. 2017లో వచ్చిన గురు మూవీలో వెంకటేష్ తన గొంతుతో పాట పాడి అలరించాడు. ఇప్పుడు ఏడేళ్లకు మరోసారి సంక్రాంతికి వస్తున్నాంలో స్పెషల్ సాంగ్ పాడి సింగర్‌గా అలరించనున్నాడు.
Venkatesh Singing Song After Guru Movie: నటనతోనే కాకుండా తమ గాత్రం అందించి మంచి సింగర్స్ అని కూడా నిరూపించుకున్న హీరోలు ఎంతోమంది ఉన్నారు. వారిలో దగ్గుబాటి విక్టరీ వెంకటేష్ ఒకరు. 2017లో వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ గురులో వెంకటేష్ మొదటిసారిగా తన గాత్రంతో అలరించాడు.
మరోసారి సింగర్‌గా
గురు సినిమాలో వెంకటేష్ ఎనర్జిటిక్ వోకల్స్‌తో పాడిన జింగిడి జింగిడి సాంగ్ చార్ట్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అందులో ఆ పాట బాగా హిట్ అయింది. ఇప్పుడు మరోసారి సింగర్‌గా అలరించనున్నారు వెంకటేష్. అంటే, గురు తర్వాత ఏడేళ్లకు మరోసారి సింగర్‌గా ఆకట్టుకునే ప్రయత్నం చేయనున్నారు విక్టరీ వెంకటేష్.
వెంకటేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా ఈ మూవీ విడుదల కానుంది. మోస్ట్ అవైటెడ్ మూవీలో ఒకటైన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని ఓ ట్రాక్‌కి తన వాయిస్‌ని అందిస్తున్నారు వెంకటేష్. దీనికి సంబంధించిన ఫన్నీ వీడియోను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్.
బిహైండ్ వీడియో రిలీజ్
ఈ సంక్రాంతికి వస్తున్నాం బిహైండ్ వీడియోలో దర్శకుడు అనిల్ రావిపూడి, హీరో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, నిర్మాత శిరీష్, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఈ ఎక్సయిటింగ్ డెవలప్‌మెంట్‌ని రివీల్ చేశారు.
వీడియోలో "ఫస్ట్ పాట గోదారి గట్టు రమణ గోగుల పాడారు అదిరిపోయింది. సెకండ్ సాంగ్ మీను భీమ్స్ అద్భుతంగా పాడాడు. ఇప్పుడు థర్డ్ సాంగ్‌ను ఎక్స్‌ట్రార్డినరీ వాయిస్‌ను ట్రై చేయాలి. ఒక హిందీ నుంచి కానీ, మలయాళం నుంచి కానీ ఏదైనా వెరైటీగా" అనిల్ రావిపూడి అంటుంటే పక్కన ఉన్న ఐశ్వర్య రాజేశ్ "తమిళం నుంచి కూడా ట్రై చేయండి" అని చెప్పింది.
నేను ఆడతా కబడ్డీ అన్నట్లుగా
ఇంతలో అక్కడికి వచ్చిన వెంకటేష్ "నేను పాడతా.. నేను పాడతా.." అని కబడ్డీ కబడ్డీ మూవీలో నటుడు చిన్న "నేను ఆడతా కబడ్డీ" అన్న తరహాలో చెప్పాడు. దాంతో అనిల్ రావిపూడి షాక్ అయి చూస్తాడు. తర్వాత మూడో పాట గురించి డిస్కషన్ వచ్చినప్పుడల్లా వెంకటేష్ తన గాత్రంతో టాలెంట్ చూపించడానికి ట్రై చేస్తుంటాడు.
వెంకటేష్ టార్చర్ తట్టుకోలేక అనిల్ రావిపూడి తనతోనే మూడో పాటను పాడించమని కోపంగా చెబుతాడు. తర్వాత వెంకటేష్ పాట పాడుతూ ఎంజాయ్ చేయడాన్ని వీడియోలో చూపించారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో సంక్రాంతి స్పెషల్ సాంగ్‌ను వెంకటేష్‌తో పాడించినట్లు సమాచారం.
ఇంట్రెస్టింగ్‌గా అనౌన్స్
ఈ పాటను త్వరలో రిలీజ్ చేయనున్నట్లు వీడియో ద్వారా ఇంట్రెస్టింగ్‌గా అనౌన్స్ చేశారు. కాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ ఎక్స్ పోలీసు ఆఫీసర్‌గా, ఐశ్వర్య రాజేష్ అతని భార్యగా, మీనాక్షి చౌదరి అతని ఎక్స్ లవర్‌గా నటిస్తున్నారు.
దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించగా.. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్‌ను పర్యవేక్షిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటింగ్‌ను నిర్వహిస్తుండగా.. ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ స్క్రీన్‌ప్లేను రూపొందించారు. ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలకు వి వెంకట్ కొరియోగ్రఫీ అందించారు.
టాపిక్