Sankranthiki Vasthunam Twitter Review: సంక్రాంతికి వ‌స్తున్నాం ట్విట్ట‌ర్ రివ్యూ - వెంకీ ట్రేడ్ మార్క్ కామెడీ-venkatesh anil ravipudi sankranthiki vasthunnam twitter review and premieres talk ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sankranthiki Vasthunam Twitter Review: సంక్రాంతికి వ‌స్తున్నాం ట్విట్ట‌ర్ రివ్యూ - వెంకీ ట్రేడ్ మార్క్ కామెడీ

Sankranthiki Vasthunam Twitter Review: సంక్రాంతికి వ‌స్తున్నాం ట్విట్ట‌ర్ రివ్యూ - వెంకీ ట్రేడ్ మార్క్ కామెడీ

Nelki Naresh Kumar HT Telugu
Jan 14, 2025 05:58 AM IST

Sankranthiki Vasthunam Twitter Review: ఎఫ్‌2, ఎఫ్ 3 త‌ర్వాత హ్యాట్రిక్ హిట్ కొట్టాల‌నే ల‌క్ష్యంతో హీరో వెంక‌టేష్, డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి చేసిన మూవీ సంక్రాంతికి వ‌స్తున్నాం. సంక్రాంతికి కానుక‌గా జ‌న‌వ‌రి 14న (నేడు) రిలీజైన ఈ మూవీ ఎలా ఉందంటే?

సంక్రాంతికి వ‌స్తున్నాం ట్విట్ట‌ర్ రివ్యూ
సంక్రాంతికి వ‌స్తున్నాం ట్విట్ట‌ర్ రివ్యూ

Sankranthiki Vasthunam Twitter Review: ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో ప్ర‌మోష‌న్స్‌, బ‌జ్ ప‌రంగా వెంక‌టేష్ సంక్రాంతికి వ‌స్తున్నాం మూవీనే ఎక్కువ‌గా హైప్ క్రియేట్ చేసింది. ఎఫ్ 2, ఎఫ్ 3 బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత హీరో వెంక‌టేష్‌, డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కాంబోలో హ్యాట్రిక్ మూవీగా సంక్రాంతికి వ‌స్తున్నాం రూపొందింది. క్రైమ్ ఫ్యామిలీ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సినిమాలో మీనాక్షి చౌద‌రి, ఐశ్వ‌ర్య రాజేష్ హీరోయిన్లుగా న‌టించారు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న (నేడు) ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం ప్రీమియ‌ర్స్ టాక్ ఎలా ఉందంటే?

టైమ్‌పాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌...

సంక్రాంతికి వ‌స్తున్నాం... టైమ్‌పాస్‌ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ అని నెటిజ‌న్లు చెబుతోన్నారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వ‌ర‌కు లాజిక్స్‌తో సంబంధం లేకుండా న‌వ్వించ‌డ‌మే ధ్యేయంగా పెట్టుకొని వెంక‌టేష్, అనిల్‌రావిపూడి ఈ సినిమా చేశార‌ని పేర్కొంటున్నారు.

వెంకీ కామెడీ టైమింగ్‌...

వైడీరాజుగా వెంక‌టేష్ అద‌ర‌గొట్టేశాడ‌ని, అత‌డి కామెడీ టైమింగ్‌, పంచ్ డైలాగ్స్ హిలేరియ‌స్‌గా ఈసినిమాలో న‌వ్విస్తాయ‌ని ఓ నెటిజ‌న్ ట్వీట్ చేశాడు. ప‌క్కా వంద కోట్ల మూవీ ఇద‌ని త‌న ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఎఫ్ 2, ఎఫ్ 3 త‌ర‌హాలోనే త‌న‌దైన ట్రేడ్ మార్క్ కామెడీతో అనిల్ రావిపూడి ఈ మూవీ తెర‌కెక్కించార‌ని చెబుతోన్నారు.

గోదారి గ‌ట్టు సాంగ్‌...

సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమాలో చెప్పుకోవ‌డానికి పెద్ద‌గా క‌థంటూ లేక‌పోయినా కామెడీ, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో బోర్ కొట్ట‌కుండా ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను న‌డిపించాడ‌ని అంటున్నారు. పాట‌లు ఈ సినిమాకు పెద్ద ప్ల‌స్ పాయింట్‌గా నిలిచాయ‌ట‌. గోదారి గ‌ట్టు, మీను పాట‌లు విజువ‌ల్‌గా బాగున్నాయ‌ని అంటున్నారు.

లాజిక్స్ విష‌యంలో పెద్ద‌గా ప‌ట్టింపులు లేక‌పోతే సినిమాను ఎంజాయ్ చేయ‌డం ఖాయ‌మ‌ని ఓవ‌ర్‌సీస్ ఆడియెన్స్ చెబుతోన్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు క‌నెక్ట్ అయ్యే అంశాలు సినిమాలో చాలానే ఉన్నాయ‌ని అంటున్నారు.

గోదారి యాస‌లో...

వెంక‌టేష్‌, ఐశ్వ‌ర్య రాజేష్ జోడి, కెమిస్ట్రీ ఆక‌ట్టుకుంటాయ‌ట‌. గోదావ‌రి యాస‌లో ఐశ్వ‌ర్య రాజేష్ త‌న‌ డైలాగ్ డెలివ‌రీతో కుమ్మేసింద‌ని అంటున్నారు. స్టైలిష్ క్యారెక్ట‌ర్‌లో మీనాక్షి చౌద‌రి న‌ట‌న బాగుంద‌ని చెబుతున్నారు.

ప‌ర్‌ఫెక్ట్ ఫ్యామిలీ మూవీ...

ఫ‌స్ట్ హాఫ్ కామెడీతో ఎంట‌ర్‌టైన్‌ చేస్తుంద‌ని, సెకండాఫ్ మాత్రం యావ‌రేజ్‌గా ఉంద‌ని ఓ నెటిజ‌న్ అన్నాడు. జ‌బ‌ర్ధ‌స్థ్ స్కిట్స్‌ను పోలి సాగే కొన్ని సీన్స్ ఇరిటేట్ చేస్తాయ‌ని ట్వీట్ చేశాడు. చిన్న చిన్న లోపాలున్నా ఈ సంక్రాంతికి ప‌ర్‌ఫెక్ట్ ఫ్యామిలీ మూవీగా సంక్రాంతికి వ‌స్తున్నాం నిలుస్తుంద‌ని ఓవ‌ర్‌సీస్ నుంచి టాక్ వ‌స్తోంది.

Whats_app_banner