Venky Anil Ravipudi: ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్...ఎక్స్‌లెంట్‌వైఫ్ తో హీరో రొమాన్స్ -సంక్రాంతికి చిరుతో వెంకీ బాక్సాఫీస్ ఫైట్
Venky Anil Ravipudi: వెంకటేష్, అనిల్‌రావిపూడి కాంబోలో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ మూవీ షూటింగ్ గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. వెంకటేష్ లేకుండానే ఫస్ట్ షెడ్యూల్‌ను షూట్ చేస్తోన్నారు. సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాత దిల్ రాజు వెల్లడించాడు.
Venky Anil Ravipudi: హీరో వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు కమర్షియల్‌గా పెద్ద హిట్స్‌గా నిలిచాయి. కామెడీ కథాంశాలతో రూపొందిన ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకుపైగా వసూళ్లను రాబట్టాయి. వెంకీ, అనిల్ రావిపూడి కాంబోలో హ్యాట్రిక్ మూవీ రాబోతోంది.

ఎఫ్ 2, ఎఫ్ 3సినిమాలు ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్‌లుగా తెరకెక్కగా...ఈమూడో సినిమాను మాత్రం క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో అనిల్ రావిపూడి రూపొందిస్తోన్నాడు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తోన్నారు.
క్రైమ్ థ్రిల్లర్ మూవీ…
ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో సినిమా హీరో పాత్రలో వెంకటేష్ కనిపించబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, అతని ఎక్స్ లెంట్ వైఫ్.. కారణంగా ఆ హీరో జీవితంలో ఎలాంటి మలుపులు తిరిగింది? ఒకరి తర్వాత మరొకరు అతడి జీవితంలో ఎలా ఎంట్రీ ఇచ్చారు అనే అంశాలతో ఈ మూవీ సాగనున్నట్లు తెలిపారు. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి...ఈ మూడు పాత్రల నేపథ్యంలోనే కథ మొత్తం సాగుతుందని సమాచారం.
దిల్‌రాజు నిర్మాత...
ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలను ప్రొడ్యూస్ చేసిన దిల్‌రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తోన్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో 58వ మూవీగా రాబోతున్న ఈ మూవీ షూటింగ్ గురువారం నుంచి హైదరాబాద్‌లో మొదలైంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ఆఫీషియల్‌గా ప్రకటించింది.
వెంకటేష్ లేకుండానే...
వెంకటేష్ లేకుండా ఈ సినిమా షూటింగ్‌ను అనిల్ రావిపూడి మొదలుపెట్టారు. ప్రస్తుతం రానా నాయుడు సీజన్ 2 షూటింగ్‌తో వెంకటేష్ బిజీగా ఉన్నారు. ఈ వెబ్‌సిరీస్ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఈ నెలాఖరులోగా రానా నాయుడు షూటింగ్‌ను పూర్తిచేసుకున్న తర్వాత అనిల్ రావిపూడి మూవీ సినిమా సెట్స్‌లో వెంకీ అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం మీనాక్షి చౌదరితో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తోన్నారు. గురువారం సినిమా షూటింగ్ తాలూకు ఓ మేకింగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో క్రైమ్ ఎలిమెంట్స్‌ని సూచించే మ్యాసీవ్ గన్స్ సెట్ ఉండటం ఆకట్టుకుంటోంది.
సంక్రాంతికి రిలీజ్...
వెంకటేష్‌తో పాటు డైరెక్టర్ అనిల్‌రావిపూడి, నిర్మాత దిల్‌రాజుకు సంక్రాంతి అచ్చొచ్చింది. ఆ సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. సంక్రాంతికి చిరంజీవి విశ్వంభర రిలీజ్ కాబోతోంది. చిరంజీవితో వెంకటేష్ బాక్సాఫీస్ వద్ద పోటీపడబోతుండటం ఆసక్తికరంగా మారింది.
భీమ్స్ మ్యూజిక్...
వెంకటేష్, అనిల్ రావిపూడి మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తోన్నాడు. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, సాయికుమార్, నరేష్‌తో పాటు ఉపేంద్ర లిమయో కీలక పాత్రలు పోషిస్తోన్నారు.
ఈ ఏడాది సంక్రాంతికి సైంధవ్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు వెంకటేష్. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. తాజాగా మళ్లీ సంక్రాంతి కే నెక్స్ట్ మూవీతో వెంకటేష్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.